Israel-Iran Battle : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. బంకర్‌లోకి కుటుంబంతో సుప్రీం లీడర్‌ ఖమేనీ..!

Israel-Iran Battle : ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఈశాన్య టెహ్రాన్‌లో భూగర్భ బంకర్‌కు తరలించినట్లు సమాచారం.

Israel-Iran Battle : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. బంకర్‌లోకి కుటుంబంతో సుప్రీం లీడర్‌ ఖమేనీ..!

Israel Iran Battle

Updated On : June 16, 2025 / 5:46 PM IST

Israel-Iran Battle : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.

ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఈశాన్య టెహ్రాన్‌లోని భూగర్భ బంకర్‌కు తరలించినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదించింది.

Read Also : Strait of Hormuz: ప్రపంచానికి హర్మూజ్ టెన్షన్.. ఏంటీ హర్మూజ్? ఇరాన్ మూసేస్తుందా? భారత్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?

ఖమేనీ కుమారుడు మోజ్తాబాతో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన వెంట ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణిలను తుడిచిపెట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ నాలుగు రోజులుగా చేస్తున్న దాడుల్లో ఇరాన్ మరణాల సంఖ్య కనీసం 224 కు చేరుకుందని, మృతుల్లో 90శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం ఉన్న మోనిరియే ప్రాంతమే కాకుండా ఖమేనీ నివాసం సమీపంలో కూడా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. ఖమేనీ నివాసానికి అతి దగ్గరలోనే ఈ దాడులు జరిగినట్లు టెహ్రాన్‌ మీడియా వెల్లడించింది.

ఖమేనీ భద్రతకు ముప్పు ఉందనే నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆయన్ను లావిజాన్‌లోని బంకర్‌కు తరలించినట్లు సమాచారం. గతంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో కూడా ఖమేనీ ఫ్యామిలీ బంకర్‌లోకి వెళ్లిన దాక్కున్నారు.

‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్టు తెలుస్తోంది. అణుశుద్ధి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇరాన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ హెచ్చరికగా మాత్రమే ఈ దాడుల చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమేనీ ఇంటికి సమీపంలో దాడులు జరిగాయి.

Read Also : Israel Iran Conflict : ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం.. ఇది యుద్ధ యుగం కాదు.. సైప్రస్‌లో ప్రధాని మోదీ కామెంట్స్

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌ భారీ నష్టపోయినట్టుగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అణుశాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు మరణించారు.

ఇరాన్‌ సైనిక దళాధికారి జనరల్‌ మహమ్మద్‌ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్‌ హెడ్ మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.