నిజంగా శకలాలను తేవడానికేనా? లేక మైనింగ్ కోసమా? చందమామపై చైనా ఎందుకు కన్నేసింది?

  • Publish Date - November 26, 2020 / 03:57 PM IST

china moon mission: చందమామపైకి 40ఏళ్ల తర్వాత చైనా రాకెట్‌ని పంపించిన ఉద్దేశం ఏంటి..? కేవలం జాబిలిపై శకలాలను తీసుకొచ్చేందుకే యుద్ధప్రాతిపదికపై చంద్రుడిపైకి రాకెట్‌ని పంపిందా…? లేక మైనింగ్ కోసమా?

ఈ అనుమానాలే ఇప్పుడు శాస్త్రలోకంలో కలుగుతున్నాయ్. చందమామ పైకి ఉపగ్రహాలను పంపడం.. మానవ యాత్రలను చేపట్టడం ఇప్పుడు కొత్తగా చైనా మొదలు పెట్టిందేం కాదు. ఐనా సరే.. ఈ సమయంలో చైనా ఎందుకు చందమామపై కన్నేసిందనే ప్రశ్న తలెత్తుతోంది.. హైనన్ సదర్న్ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి చైనా చాంగ్ 5( ఫైవ్) మిషన్‌ని పంపగానే డ్రాగన్ కంట్రీ ప్రయోగాలపై మరోసారి చర్చ బయలుదేరింది.
https://10tv.in/europe-mulberry-tree-in-mntenegro-that-gushes-water-every-time-it-rains/
చైనా పంపిన చాంగ్ ఫైవ్ మిషన్‌లో భారత్ చేపట్టిన చంద్రయాన్‌ లానే ఆర్బిటర్, ల్యాండర్‌, రోవర్‌లానే..ఆర్బిటర్..ల్యాండర్‌తో పాటు అసెండర్..రిటర్నర్ ఉన్నాయ్..ఈ నాలుగిటి బరువు కూడా 8.2టన్నులు మాత్రమే.. అంటే వీలైనంత తక్కువ బరువుతో చాంగ్ ఫైవ్ ప్రయోగం చేపట్టింది చైనా.. చంద్రుడి కక్ష్యలో దిగిన తర్వాత చాంగ్ మిషన్‌లోని నాలుగు ఎలిమెంట్స్ విడిపోతాయ్. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 200కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటర్. రిటర్నర్‌లు చక్కర్లు కొడుతూ తమ పరిశోధన సాగిస్తాయ్.. అంటే ల్యాండింగ్‌కి ముందే ఈ రెండూ విడిపోతాయ్.. తర్వాత ల్యాండర్ అసెండర్..రెండూ చంద్రుడి ఓషన్ ఆఫ్ స్టార్మ్ ప్రాంతంలో దిగుతాయ్.

జాబిలి పైకి మనిషిని పంపిన మూడో దేశంగా చైనా రికార్డు:
అక్కడే తమ అసలు పరిశోధన సాగిస్తాయ్.. తమకి కావాల్సిన శిలలు..మట్టి..శకలాలు సేకరించిన తర్వాత తిరిగి చాంగ్ మిషన్‌లోకి వస్తాయ్.. చంద్రగ్రహంపైకి ప్రవేశించిన 48 గంటల్లో రోబోటిక్ ఆర్మ్ తవ్వకాలు మొదలుపెడుతుంది.. దాదాపు రెండు కేజీల నమూనాలు భూమిపైకి తెస్తుంది.. ఐతే ఈ ప్రయోగంలో చైనా ఆస్ట్రోనాట్స్‌ని పంపడం ఓ రికార్డుగా చెప్పాలి..ఇలా చంద్రుడిపైకి మనుషులను పంపడం గత నలభైఏళ్లలో ఇదే తొలిసారి.. ఈ ప్రయోగంతో చైనా..జాబిలిపైకి మనిషిని పంపిన మూడో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది.. అలానే చంద్రగ్రహంపై 20 రోజులు పాటు చాంగ్ రాకెట్ గడపనుంది.

అంతు లేని విలువ కలిగిన ఖనిజాల అన్వేషణ కోసమే మిషన్?
ఇదీ చైనా చెప్తున్న వెర్షన్. ఇక్కడే అగ్రదేశం అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా చైనా ప్రయోగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. చందమామపై మైనింగ్ కోసమే చైనా ప్రయోగం చేపడుతుందని ఆరోపిస్తున్నాయ్. అంతు లేని విలువ కలిగిన ఖనిజాల అన్వేషణే ఈ మిషన్ అసలు లక్ష్యమని విమర్శిస్తున్నాయ్. ఒక్క చైనాపై ఈ విషయంలో విమర్శలు రావడం సంగతి పక్కనబెడితే.. అంతరిక్షంలో టూరిజం కానీ..వాణిజ్యం కానీ..ఏదైనా సరే ఇప్పటికే అమెరికా, రష్యా కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయ్.. ఐతే ఇలా ఏకంగా చందమామని తవ్వేసే వ్యూహాలు మాత్రం చేయలేదంటున్నారు.

చైనా మాత్రం తమ చాంగ్ ఫైవ్ మిషన్ ద్వారా చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు వీలు కలుగుతుందని చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై, వాతావరణ పరిస్థితులపై మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చని నమ్మబలుకుతోంది. ఇంతకీ ఇదే నిజమా.. లేక డ్రాగన్ కంట్రీ.. జాబిలిపై జలం సంగతి పక్కనబెట్టేసి ఖనిజం కోసం అన్వేషణ మొదలుపెట్టిందా.. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చన్.