Pak Afghan
Pakistan-Taliban అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా మరియు ఇతర విదేశీ దళాల నిష్క్రమణ పూర్తైన నేపథ్యంలో అప్ఘాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులలో ఇప్పుడు ఆందోళన పెరిగిపోతుందట. అఫ్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల దాడులు పెరుగుతాయని పాకిస్తాన్ భయపడుతోందని సమాచారం. గత కొద్ది వారాలుగా అప్ఘాన్-పాక్ సరిహద్దుల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది పాకిస్తాన్. పాక్ సైనికులు అప్ఘాన్ బోర్డర్ లో హై అలర్ట్ లో ఉన్నట్లు సమాచారం.
READ Kashmir: కశ్మీర్ కోసం తాలిబాన్ల సాయం తీసుకుంటాం ; పాకిస్తాన్
ఇటీవల అప్ఘానిస్తాన్ లో ఐసిస్..వరుస ఉగ్రదాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిస్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ఫైటర్లు మరియు పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ కి చెందిన ఫైటర్లు..అఫ్ఘానిస్తాన్ నుండి వచ్చి తమ భూభాగంపై ప్రాణాంతక దాడులు చేస్తారమోనని పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, గత రెండు దశాబ్దాలలో జిహాది హింసలో వేలాది మంది పాకిస్తానీలు మరణించిన విషయం తెలిసిందే. రాబోయే రెండు మూడు నెలలు కీలకం అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఇటీవల అప్ఘానిస్తాన్ లో ఐసిస్ ఉగ్రసంస్థ వరుస ఉగ్రదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఐసిస్ సహా పుంజుకున్న ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపుల వల్ల కలిగే ముప్పు గురించి ప్రస్తావిస్తూ.. తాలిబాన్లు వారి భూభాగాన్ని వారు నియంత్రించడానికి మేము (అంతర్జాతీయ సమాజం) వారి సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడంలో సహాయం చేయాలి అని ఆ పాక్ అధికారి పేర్కొన్నారు. అఫ్ఘాన్ మిలిటరీని పునర్వ్యవస్థీకరించడంలో తాలిబాన్లకు సహాయం చేయడానికి పాకిస్తాన్ భద్రతా మరియు ఇంటెలిజెన్స్ అధికారులను మరియు పాక్ గూడచర్య సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఏజెన్సీ అధిపతిని కూడా కాబూల్‌కు పంపాలని యోచిస్తోందని సమాచారం.
పాకిస్తాన్ లేదా మరేదైనా దేశంపై దాడులకు ప్లాన్ చేసే ఎవరైనా తమ భూభాగాన్ని ఉపయోగించడానికి అనుమతించబోమని అఫ్ఘాన్ తాలిబాన్లు చెబుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, పాకిస్తాన్‌పై దాడులకు ప్లాన్ చేస్తున్న తీవ్రవాదులను అఫ్ఘన్ తాలిబాన్లు తమకు అప్పగిస్తారని పాకిస్తాన్ అంచనా వేస్తోంది.
READ Al Qaeda : కశ్మీర్ కి స్వేచ్ఛ కల్పించండి..తాలిబన్ ని కోరిన అల్ ఖైదా
READJaish-e-Mohammed Chief : కశ్మీర్ లో ఉగ్రవాదానికి సహకరించాలని..తాలిబన్లను కలిసిన మసూద్!