Jaish-e-Mohammed Chief : కశ్మీర్ లో ఉగ్రవాదానికి సహకరించాలని..తాలిబన్లను కలిసిన మసూద్!

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి

Jaish-e-Mohammed Chief :  కశ్మీర్ లో ఉగ్రవాదానికి సహకరించాలని..తాలిబన్లను కలిసిన మసూద్!

Azhar2

Jaish-e-Mohammed Chief  అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశంలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ సహా ముగ్గురని ఉగ్రవాదులు విడిపించుకున్న విషయం తెలిసిందే.

అయితే రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు అప్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతమైన వేళ.. జైషే మొహమ్మద్ శ్రేణుల్లో సంతోషం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. తాలిబాన్ల అండ చూసుకుని కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాలని జైషే మొహమ్మద్ భావిస్తున్నట్లు సమాచారం. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇప్పటికే కాందహార్ చేరుకుని తాలిబన్ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల మూడో వారంలోనే కాందహార్‌ చేరుకున్న మసూద్ అజహర్‌.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు కీలక తాలిబాన్ నేతలను కలిసి కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల విజయాన్ని జైషే మొహమ్మద్ పండుగ చేసుకుంది. ఆగస్టు-15న తాలిబన్లు కాబూల్ ని హస్తగతం చేసుకున్న తర్వాత..అప్ఘాన్ లో అమెరికా మద్దతుగల ప్రభుత్వం ఇక కూలిపోయిందని మసూద్ అజర్ వ్యాఖ్యానించారు.

తాలిబాన్, జైషే మొహమ్మద్‌లు భావజాల సారూప్యమున్న సంస్థలుగా పేర్కొంటుంటారు. ఇస్లామిక్ చట్టం అయిన షరియాను తమకు తగినట్లుగా అన్వయించుకోవడంలో తాలిబాన్ మరియు జైషే మహ్మద్ సైద్ధాంతిక సహచరులుగా పరిగణించబడ్డారు. మసూద్ అజహర్ 1999లో భారత జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అది అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌లో యాక్టివ్‌గానే ఉన్నది.