Islamabad magistrate issues arrest warrant against Imran Khan
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్లో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక మహిళా జడ్జిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, బహిరంగంగా ఆమెకు బెదిరింపులు చేసినందుకు గాను ఈ వారెంట్ జారీ చేశారు. ఈ విషయమై ఇస్లామాబాద్‌లోని మర్గల్ల పోలీస్ స్టేషన్లో ఆగస్టు 20న కేసు నమోదు అయింది. అనంతరం ఇస్లామాబాద్‌లోని స్థానిక కోర్టులో పరిశీలనకు వెళ్లగా తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
జిల్లి సెషన్స్ కోర్టు జడ్జి జెబా చౌదరిపై ఇమ్రాన్ వివాదాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడ్డట్లు పలు కేసులు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 506 (నేరపూరిత చర్యలకు పాల్పడడం), సెక్షన్ 504 (అశాంతిని రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 189 (ప్రభుత్వ అధికారిని బెదిరించడం), సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారి పట్ల బాధ్యతారహితంగా అగౌరవంగా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేసినట్లు పాకిస్తాన్‌కు చెందిన గియో న్యూస్ పేర్కొంది.
వాస్తవానికి తాను తప్పు చేశానని, గీత దాటి వ్యవహరించాలని గుర్తు చేస్తూ క్షమాపణలు వేడుకుంటున్నట్లు కోర్టు ముందు ఇమ్రాన్ అఫిడవిట్ దాఖలు చేసిన ఒక గంట అనంతరం కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ విడుదల కావడం గమనార్హం. అయితే న్యాయవ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు భయంకరమైనవని, వాటి పట్ల ఆయనపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కోర్టు అభిప్రాయపడ్డట్టు సమాచారం.
Congress President Poll: కాంగ్రెస్ అత్యున్నత పదవి రేసులో ఇద్దరూ దక్షణాది నేతలే