Congress President Poll: కాంగ్రెస్ అత్యున్నత పదవి రేసులో ఇద్దరూ దక్షణాది నేతలే

పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్టొచ్చినట్టే కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఆ పార్టీకి జరుగుతున్న ఎన్నికలు.. ఇందుకు పూర్తి విరుద్ధంగా జరగనున్నాయి

Congress President Poll: కాంగ్రెస్ అత్యున్నత పదవి రేసులో ఇద్దరూ దక్షణాది నేతలే

Two south indian leaders in race to congress party top chair

Congress President Poll: జాతీయ రాజకీయ పార్టీలు అంటే ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది. ఉత్తరాది నుంచే పార్టీ అధినేతలు వస్తుంటారు. సదరు పార్టీలు అధికారంలోకి వస్తే మళ్లీ ఉత్తరాది నేతలే కీలక పదవులు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు.. ఇలా ఏ పార్టీ గురించి మాట్లాడుకున్నా.. ఉత్తరాది ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా కొద్ది సందర్భాల్లో దక్షిణాది నేతలు కూడా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వాదినేతలు అయిన సందర్భాలు ఉన్నాయి. పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఉత్తరాది నేతల ఆధిపత్యం, సమయంతో పోల్చుకుంటే దక్షిణాది నేతలది చాలా తక్కువగా ఉంటుంది.

ఇక పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్టొచ్చినట్టే కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఆ పార్టీకి జరుగుతున్న ఎన్నికలు.. ఇందుకు పూర్తి విరుద్ధంగా జరగనున్నాయి. బహుశా పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నేతలూ దక్షిణాది వారే. మల్లికార్జున ఖర్గే, కర్ణాటకకు చెందిన నేత కాగా.. శశి థరూర్, కేరళకు చెందిన నేత.

వాస్తవానికి ఈ ఎన్నికలో రాజస్తాన్ సీఎం గెహ్లాట్ కీలకంగా ఉండాల్సింది. కానీ, సొంత రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం వల్ల ఆయనను అధిష్టానం పక్కన పెట్టింది. అనంతరం గాంధీ కుటుంబానికి విధేయుడైన మల్లికార్జున ఖర్గేను పోటీలో దింపింది. దీనికి ముందే శశి థరూర్ పోటీలో ఉన్నారు. ఖర్గేకు ముందు.. ఉత్తర-దక్షిణాల పోరుగా ఉండగా.. తాజాగా దక్షిణాది నేతల మధ్యే పోటీ ఫైనల్ అయింది. సోనియా గాంధీ పగ్గాలు చేపట్టే ముందు తెలుగువాడైన పీ.వీ.నర్సింహారావు పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. మళ్లీ 24 ఏళ్ల అనంతరం మరోసారి దక్షిణాది నేతకు పగ్గాలు రాబోతున్నాయి.

Congress President Poll: గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఖర్గేకు ఓటేయమంటూ థరూర్ సంచలన వ్యాఖ్యలు!