Hamas Tunnels : గాజాలోని హమాస్ సొరంగాల్లోకి సముద్రపు నీటి పంపింగ్

గాజాలోని హమాస్ టన్నెళ్లను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం అందులోకి సముద్రపు నీటిని పంపింగ్ చేస్తుంది. హమాస్ ఉగ్రవాదులు గాజా టన్నెళ్లలో బందీలు, యోధులు, ఆయుధాలను దాచారని ఇజ్రాయెల్ సైన్యానికి సమాచారం అందింది....

Hamas Tunnels : గాజాలోని హమాస్ టన్నెళ్లను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం అందులోకి సముద్రపు నీటిని పంపింగ్ చేస్తుంది. హమాస్ ఉగ్రవాదులు గాజా టన్నెళ్లలో బందీలు, యోధులు, ఆయుధాలను దాచారని ఇజ్రాయెల్ సైన్యానికి సమాచారం అందింది. దీంతో గాజాలోని హమాస్ సొరంగాలను ధ్వంసం చేయడానికి అందులోకి సముద్రపు నీటిని ఇజ్రాయెల్ సైనికులు పంపింగ్ చేస్తున్నారని అమెరికా అధికారులు చెప్పారు.

ALSO READ : Telangana CM Revanth Reddy : తెలంగాణలో బదిలీల పర్వం…రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి టీం

గాజా సొరంగాల ధ్వంసం చేయడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చని అమెరికా అధికారులు చెప్పారు. హమాస్ సమూహం బందీలు, యోధులు, ఆయుధాలను దాస్తోందని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది. దీంతో సొరంగాలను నాశనం చేయడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుందని కొంతమంది అమెరికా అధికారులు తెలిపారు.

ALSO READ : Jeevan Reddy : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలకు చెక్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దందాలు

సముద్రపు నీరు గాజా నగరంలోని మంచినీటి సరఫరాకు ప్రమాదం కలిగిస్తుందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సొరంగాల్లోకి సముద్రపు నీటి పంపింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు