Israeli Ground Troops : గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ దళాలు ముట్టడి.. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం తప్పదా?

పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. భీకర యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచ దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

Israeli Ground Troops : పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. భీకర యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచ దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ దళాలు గాజా స్ట్రిప్ సమీపంలో ఇజ్రాయెల్ దళాలతో చేరినట్లు ఆ దేశ రక్షణ దళాలు ప్రకటించాయి. తొలిసారిగా ట్యాంకులు, ఫిరంగిదళాలను మోహరించాయి. ఇజ్రాయెల్ 9,000 మంది రిజర్వడ్ సైనిక బలగాలను పిలిచింది. హమాస్ నియంత్రణలో ఉన్న గాజాతో సరిహద్దులో కనీసం మూడు బ్రిగేడ్ మిలటరీ యూనిట్లను మోహరించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చివరి యుద్ధం 2014లో జరిగింది.

జెరూసలెంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాలస్తీనియన్లు ఆరు పాలస్తీనా కుటుంబాలను హతమార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ జాతీయవాదుల నియంత్రణలోని నగరం పునరేకీకరణ ఉత్సవాన్ని జరుపుకోవడానికి వార్షిక కవాతుకు ప్లాన్ చేస్తున్నారు. నగరం హింసకు పాల్పడిన పాలస్తీనా నిరసనకారులను ఇజ్రాయెల్ పోలీసులు చెదరగొట్టారు. వారిలో కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇజ్రాయెల్ పోలీసులు అక్కడి నుంచి తక్షణమే వెళ్లకపోతే ఇజ్రాయెల్ పై దాడిచేస్తామని హమాస్ హెచ్చరించింది. అల్-అక్స్ మసీదును కాపాడుకోడానికే పోరాడుతున్నామని గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ మిలిటెంట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో గామా, ఇజ్రాయెల్ నుంచి వేలాది రాకెట్లతో హమాస్ కాల్పులు జరిపింది. ప్రతిదాడిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 28 మంది పిల్లలతో సహా కనీసం 109 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాకెట్ దాడుల్లో అనేక ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ మిలిటరీ అనేక హమాస్ కమాండర్లను హతమార్చినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ అతిపెద్ద నగరాలను లక్ష్యంగా హమాస్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు మరణించారు.

గాజా నుంచి కాల్చిన వందల రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. గాజా స్ట్రిప్‌ను పర్యవేక్షిస్తున్న హమాస్‌కూ, అటు ఇజ్రాయెల్‌ దళాలకూ మధ్య సాగుతున్న సమరంలో ఇప్పటిదాకా 83 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఇందులో 17 మంది పిల్లలు, ఏడుగురు మహిళలున్నారు. మరో 480 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌వైపు ఒక సైనికుడు, ఆరుగురు పౌరులు మరణించగా అందులో కేరళకు చెందిన ఒక నర్సు కూడా ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు