Italian Former PM Berlusconi: 33 ఏళ్ల ప్రియురాలికి రూ. 906 కోట్లు రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని

సిల్వియో బెర్లుస్కోనీ మూడు సార్లు ఇటాలియన్ ప్రధాన మంత్రిగా పనిచేశాడు. అతని ఆస్తుల విలువ సుమారు 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.

Italian Former PM Berlusconi

Silvio Berlusconi: ఇటలీ మాజీ ప్రధాని, ఇటలీలో అతిపెద్ద మీడియా కంపెనీని సృష్టించిన బిలియనీర్, వ్యాపారవేత్త సల్వియో బెర్లు‌స్కోనీ గత నెలలో మరణించిన విషయం విధితమే. బెర్లుస్కోనీ చనిపోవటం తన 33 ఏళ్ల ప్రియురాలికి బంపర్ ఆఫర్ తగిలినట్లయింది. మాజీ ప్రధాని చనిపోతూ తన ఆస్తిలో 100 మిలియన్ యూరోల (రూ. 906 కోట్లు)ను ప్రియురాలు మార్తా ఫాసినాకు వీలునామా రాశాడు. ఈ ఏడాది ప్రారంభంలో బెర్లుస్కోనీ దీర్ఘకాలిక లుకేమియా చికిత్సకోసం ఆస్పత్రిలో చేరాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో 86 సంవత్సరాల వయస్సులో గత నెలలో మరణించాడు. అయితే మార్గా ఫాసినా 2020లో బెర్లుస్కోనీతో డేటింగ్ ప్రారంభించింది. ఆమెకు ప్రస్తుతం 33 ఏళ్లు. ఇద్దరి మధ్య దాదాపు 53 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే, వీరిద్దరూ అధికారికంగా పెళ్లిచేసుకోనప్పటికీ.. ఫాసినాను తన భార్యగా సిల్వియో చెప్పేవారు.

Detox the Body : చెమట రూపంలో శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపవచ్చా ? అపోహలు VS వాస్తవాలు

సిల్వియో బెర్లుస్కోనీ మూడు సార్లు ఇటలీ ప్రధానమంత్రిగా పనిచేశారు. అతని ఆస్తుల విలువ సుమారు 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అతని వ్యాపార సామ్రాజ్యాన్ని ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోచే చూస్తున్నారు. ఇప్పటికే వారు వ్యాపారంలో ఎగ్జిక్యుటివ్ పాత్రలను కలిగిఉన్నారు. బెర్లుస్కోనీ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. పన్ను మోసానికి పాల్పడినందుకు ఆరు సంవత్సరాల పాటు రాజకీయాల నుంచి నిషేధానికి గురయ్యారు.

Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి ..

గత వారం రోజుల క్రితం ఐదుగురు పిల్లలు, ఇతర సాక్షుల సమక్షంలో సల్వియో బెర్లు‌స్కోనీ చనిపోయే ముందు రాసిన వీలునామాను బహిర్గతం చేశారు. ఈ వీలునామాలో.. తన పిల్లలు మెరీనా, ఫీర్ సెల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికీ సమాన భాగాలుగా ఆస్తులను అప్పగిస్తున్నట్లు ఆ వీలునామాలో రాశాడు. తన సోదరుడు పాలోకు 100 మిలియన్ యూరోలను రాసిచ్చారు. తన ఆప్తుడు మార్సెలో డెలుట్రీకి మరో 30 యూరోలు రాసిచ్చారు. అయితే, తన 33 ఏళ్ల ప్రియురాలు ఫాసినాకు 906 కోట్ల ఆస్తులను కట్టబెడుతూ వీలునామా రాయడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు