Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి ..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్ - 3ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? ఈ ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తుంది.

Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా?  అయితే ఇలా చేయండి ..

Chandrayaan-3

Chandrayaan-3 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ -3 ఈనెల 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగానికి సిధ్దమైంది. ఈ మేరకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. మిషన్‌లో భాగంగా ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్ -3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఉపగ్రహం సుమారు 3,84,000 కిలో మీటర్లు ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. ఆ తరువాత జాబిల్లి దక్షిణ ద్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమైతే దేశంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా?

అయితే, ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్ – 3ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? ఈ ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తుంది. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఆన్‌లైన్‌లో Lvg.shar.gov.in అనే లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని ఇస్రో ట్వీట్ చేసింది. ఇలా నమోదు చేసుకున్నవారు శ్రీహరి‌కోటలోని లాంచ్ వ్యూ గాలరీ నుంచి ప్రయోగాన్ని నేరుగా వీక్షించొచ్చు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లాంచ్ వ్యూ గ్యాలరీలో 5వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. సందర్శకులకోసం పెద్దస్క్రీన్లు ఏర్పాటు చేసింది. అయితే, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ ప్రయోగం మొదలవుతుందని ఇస్రో డైరెక్టర్ ఎస్. సోమనాథ్ ఇప్పటికే ప్రకటించారు.

శ్రీహరికోటలోని స్టేడియం ఆకారంలో ఉన్న లాంచ్ వ్యూ గ్యాలరీలో 5వేల మంది కూర్చొనే అవకాశం ఉంది. ఈ లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి చూస్తే శ్రీహరికోటలో ఉండే రెండు లాంచ్ ప్యాడ్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. సందర్శకులు ఈ గ్యాలరీ నుంచి లైవ్‌లో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని వీక్షించొచ్చు. అయితే, లాంచర్ ఉపగ్రహాలను వివరించడానికి పెద్ద పెద్ద స్క్రీన్స్‌ను ఇస్రో ఏర్పాటు చేసింది. ఇక్కడ లైవ్‌లో ర్యాకెట్ ప్రయోగం చూడటంతో పాటు ప్రయోగానికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది.