గంటలపాటు బాత్రూమ్‌కు వెళ్లకుండా పనిచేస్తున్నాం..నీలాంటి వారే నిజమైన దేవతలు తల్లీ..

కరోనా రోగులకు సేవ చేస్తన్న నేనో నర్సును.నేనిప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని..ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు..అవసరాన్ని బట్టి...10 గంటల వరకూ.. మంచి నీళ్లు తాగకుండా బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది. 

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 04:53 AM IST
గంటలపాటు బాత్రూమ్‌కు వెళ్లకుండా పనిచేస్తున్నాం..నీలాంటి వారే నిజమైన దేవతలు తల్లీ..

Updated On : March 13, 2020 / 4:53 AM IST

కరోనా రోగులకు సేవ చేస్తన్న నేనో నర్సును.నేనిప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని..ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు..అవసరాన్ని బట్టి…10 గంటల వరకూ.. మంచి నీళ్లు తాగకుండా బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది. 

ఎవరైనా తుమ్మినా..దగ్గినా ఆమడదూరం పారిపోతాం.కానీ కరోనా రోగులకు సేవలు చేసే నర్సుల, డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి ఎమిటి? వీరి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం వారి పరిస్థితి గురించి ఊహించామా? అంటే ఎవరికి వారు ఆలోచించాల్సిన పరిస్థితి. వారు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ గురించి..కరోనా రోగులకు సేవ చేస్తున్న ఓ నర్స్..కరోనా రోగులకు వైద్యం అందించే క్రమంలో వారు పడుతున్న బాధలను సోషల్ మీడియా ద్వారా వివరించింది. ఆ నర్సు పేరు అలేసియా బొనారీ. ఆమె ఇటలీ దేశస్తురాలు. కరోనా బాధితులకు సేవ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.

‘నేనో నర్సును.నేనిప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేను పెట్టుకున్న మాస్క్ జారిపోతుందేమోనని..నేను పెట్టుకున్న కళ్లద్దాలు నా కళ్లను సరిగా కవర్ చేయట్లేదేమోనని భయం. గ్లోవ్స్ వెసుకున్న చేతులతో నన్ను నేను అనుకోకుండా నేరుగా తాకుతున్నాననే భయం. అలా తాకి కరోనా బారిన పడ్డానేమోనని భయం. ఎందుకంటే నాకు కరోనా వస్తే రోగులకు సేవ చేసే వైద్యం సిబ్బందిలో ఒకరు తగ్గిపోతారనే నా భయం. ఒక్కసారి కోటు, గ్లౌవ్స్ ధరించిన తరువాత ఏకధాటిగా ఆరు గంటల పాటు..అవసరాన్ని బట్టి…10 గంటల వరకూ.. మంచి నీళ్లు తాగకుండా బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా పనిచేయాల్సి ఉంటుంది. 

ఈ ఒత్తిడితో  శారీరకంగానూ..మానసికంగా అలసిపోతున్నారు. ఇది నా ఒక్కదాని పరిస్థితే కాదు నాలాగే ఎంతో వైద్యసిబ్బంది పరిస్థితి. కానీ నాకు నా వృత్తి అంటే ప్రేమే కాదు గౌరవం కూడా. ప్రశాంతత కోసం నా ఇంటికి వెళ్లలేను. అటువంటి పరిస్థితి. అయినా సరే..నిరంతరం రోగులకు సేవ చేస్తా. నా భాధ్యత అకింత భావంతో నిర్వర్తిస్తా. మీరు కూడా మీ బాధ్యతలను అదే రీతిగా నిర్వర్తించండి’ అంటూ తెలిపింది అలేసియా బొనారీ.

నిరంతరం మాస్క్ ధరించడం వల్ల తన మొహం ఎలా ఒరుసుకుపోయిందో చూపిస్తూ ఓ సెల్ఫీ కూడా జత చేశారు అలేసియా బొనారీ. ఈ పోస్టు విపరీతంగా వైరల్ అయింది. 7.3 లక్షల లైకులు, వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఇవి కొనసాగుతునే ఉన్నాయి. ‘అలేసియా.. నువ్వు, నీలాంటి వారే నిజమైన దేవతలు. నిజమైన త్యాగధనులు.. థాంక్యూ అంటూ వేలాదిగా నెటిజన్లు ఇటలీ వైద్య సిబ్బందికి మద్దతు తెలిపారు. తెలుపుతున్నారు కూడా. 

డాక్టర్లు నర్సులంటే దేవతలకు మరోపేరు. ఎందుకంటే దేవుడు మనిషికి జన్మనిస్తే డాక్టర్లు,నర్సులు రోగాలబారిన పడివారిని పునర్జన్మనిస్తారు. ముఖ్యంగా నర్సులు రోగులకు సేవ చేసే విషయంలో ఎంతో సహనంతో..ఓర్పుతో పనిచేస్తారు.రాత్రి..పగలు తేడా లేకుండా సేవచేస్తారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కరోనా రోగుల విషయంలో నర్సులు 24 గంటలూ విశ్రాంతిలేకుండా పనిచేస్తున్నారు. వారి కుటుంబాలను కూడా వదిలేసి కరోనా రోగుల కోసం హాస్పిల్ వార్డులకే పరిమితం అయిపోతున్నారు. నిద్రాహారాలు మాని సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాతో యుద్ధం చేస్తున్నారు.  (కరోనా ఎఫెక్ట్: కుప్పకూలిన మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్.. భారీగా నష్టాలు)

కాగా..చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ ఇటలీలో మృత్యుఘోష కొనసాగిస్తోంది. అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. మార్చి 12,2020 ఒక్కరోజే  కరోనా సోకి 189 మంది చనిపోయారు. అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు.  ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా పౌరులు చనిపోయారు. దీంతో ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతంగా మారిపోయింది.

ఫుడ్ స్టోర్స్, ఫార్మసీలు..ఈ రెండూ తప్ప ఇటలీలో ఇప్పుడు ఏ షాపులు ఓపెన్ చేసి కనిపించటంలేదు. ఎటు చూసినా రెస్టారెంట్లు..షాపులు..బార్లు..స్కూళ్లు..కాలేజీలు..ఆఫీసులు అన్నీ అన్నీ మూసేసి కన్పిస్తున్నాయ్. దేశం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఇటలీలో మానసిక వ్యాధులు ప్రబలే అవకాశం కూడా కన్పిస్తోంది. 

See Also | విమానం నడిపిన కేటీఆర్..గాల్లో చక్కర్లు