Cheteshwar Pujara Retirement : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెతేశ్వర్ పుజారా.. ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు

Cheteshwar Pujara Retirement : టీమిండియా ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు

Cheteshwar Pujara Retirement : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెతేశ్వర్ పుజారా.. ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు

Cheteshwar Pujara Retirement

Updated On : August 24, 2025 / 12:21 PM IST

Cheteshwar Pujara Retirement : టీమిండియా ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara Retirement) క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పుజారా ప్రకటించారు. భారత జెర్సీని ధరించి ఆడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (Cheteshwar Pujara Retirement)

‘‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం మరియు నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా శాయశక్తులా ప్రయత్నించడం – దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ వారు చెప్పినట్లుగా, ప్రతి మంచి విషయం ముగింపునకు రావాలి. నేను అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎళ్లప్పుడూ ప్రేమ పంచుతూ, మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ పుజారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ లేఖను పుజారా పోస్టు చేశారు. ఇందులో తన చిన్నతనం నుంచి టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగిన సమయంలో పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు.

‘‘కుటుంబంతో కలిసి రాజ్‌కోట్ పట్టణం నుంచి వచ్చిన ఓ కుర్రాడు భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎంతో అనుభవం సాధించా. నా రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని పుజారా తెలిపారు. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు. ఫ్రాంచైజీ, కౌంటీ క్రికెట్ ప్రతినిధులకూ ధన్యవాదాలు. నా మెంటర్ లు, కోచ్ లు, ఆధ్యాత్మిక గురు.. ప్రతిఒక్కరూ నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పుజారా పేర్కొన్నారు. ఇక నుంచి మరింత సమయం నా కుటుంబానికి వెచ్చించేందుకు ప్రయత్నిస్తానని’’ పుజారా తెలిపారు.

Also Read: Asia Cup 2025 : ఆసియా కప్ టోర్నీకి ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. డ్రీమ్ 11 వెనక్కు తగ్గిందా..

పుజారా టెస్ట్, వన్డే కెరీర్ ఇలా..

ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara).. అంతర్జాతీయ క్రికెట్లోకి 2010లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 103 టెస్టులు ఆడాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్ లో మొత్తం 7,195 పరుగులు చేశాడు. టీమిండియా జట్టు తరపున వన్డే మ్యాచ్‌లలో ఆడేందుకు పుజారాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కేవలం ఐదు వన్డేల్లో ఆడిన అతను 51 పరుగులు చేశాడు. పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆడాడు.