ఇవాంకా ట్రంప్ దిగిన తాజ్ మహాల్ ఫొటోలో తేడా గుర్తించారా? ఫొటోషాప్ చేశారా? ఏంటి?

  • Publish Date - February 26, 2020 / 04:07 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ భారత్ ట్రిప్ విజయవంతంగా ముగిసింది. భారత్ పర్యటనను ముగించుకుని ట్రంప్ తన కుటుంబంతో కలిసి అమెరికాకు తిరిగిపయనమయ్యారు. భారత పర్యటనలో ట్రంప్, ఆయన సతీమణి మలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్ ఆమె భర్త అందరూ కలిసి ఆగ్రాలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు.

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజా మహాల్ దగ్గర ట్రంప్ కుటుంబం ఫొటోలు దిగారు. ఇవాంకా ట్రంప్ కూడా తాజ్ ముందు నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. పర్యటన అనంతరం ఇవాంకా.. తాను తాజ్ మహాల్ దగ్గర దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఫాలోవర్లతో పంచుకున్నారు. ‘తాజ్ మహల్ వైభవం, అందం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది’ అంటూ ఇవాంకా తన ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.

ఏదేమైనా, ఈ #FactCheck ఫొటోలను ఇవాంకా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె ఫొటోపై కామెంట్ల జల్లు కురిసింది. 38 ఏళ్ల ఫస్ట్ డాటర్.. మీ ఫొటోను ఫొటోషాపులో ఎడిట్ చేశారా అంటూ ప్రశ్నించారు. ఇవాంకా నిలబడిన ఫొటోలో వెనుక వైపు తాజ్ మహాల్ ముందు వాటర్ పూల్ ఉంది. ఇవాంకా ఎడమ చేతి మధ్యలో ఉన్న ప్రాంతంలో కనిపించే నీరు.. ఇరువైపులా ఉన్న నీటి కంటే స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది’.

ఫొటోను ఎడిటింగ్ చేయడంలో జరిగిన అలసత్వానికి ప్రతీక కావచ్చునని అవుట్ లెట్ ప్రశ్నించింది. ఇవాంకా ఫొటోలో సన్నగా కనబడేలా చేసేందుకు ఎడమ చేతి మధ్యలో ఖాళీ ఎక్కువగా ఉండేలా ఫొటోషాప్ ఎడిటింగ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. ట్రంప్ కుమార్తె #IvankaTrump ఇవాంకా ఫొటోను ఎడిటింగ్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె తన నడుమును చిన్నదిగా చేసింది’ అని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. ’ఆమె నడుము చేయి మధ్య నీటిని చూడండి. ఇది పక్కనే ఉన్న నీటి కంటే రంగు ఆకృతి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది ’ అని ట్వీట్ చేశాడు.

‘పూర్తి పూల్ నీటిని బ్లర్ చేయండి.. లేదా ఇవాంకా నడుము / చేయి అంతరాన్ని క్రమబద్ధీకరించండి.. లేదంటే ఆమె నడుమును ఫొటోషాప్‌లో ఎడిటింగ్ చేశారని మేము అనుకోవచ్చు’ అని మరొక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఫొటోలోని గందరగోళానికి ఒక కారణం ఏమిటంటే.. ఫొటో ఐఫోన్ పోర్ట్రెయిట్ మోడ్‌లో తీయడం జరిగింది.

ఇది ఫొటో స్పష్టత అస్థిరతకు కారణమని చెప్పొచ్చు. ఏదేమైనా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇవాంకా ఫోటోను అదే సమయంలో AFP ఫోటోగ్రాఫర్ మాండెల్ న్గాన్ పోస్టు చేసిన ఇవాంకా ఫొటోతో పోలిస్తే.. ఆమె నడుము ఖచ్చితంగా ఫోటోషాప్ చేసినట్టే’ అని అవుట్‌లెట్‌కు తెలిపింది.