Police Detained Shinzo Abe Shooter
Police detained Shinzo Abe shooter : జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై నరా నగరంలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో మాజీ ప్రధాని షింజో అబే మరణించారు. ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తుండగా తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన షింజో అబేను స్థానిక ఆసుపత్రికి తరలించా ఆయనను బ్రతికించటానికి వైద్య నిపుణులు ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదు. అబే ప్రాణాలు విడిచారు.
కాగా..షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని యమగామి టెట్సుయా అనే మాజీ సైనికుడిగా గుర్తించారు. అతడి వయసు 41 ఏళ్లు. గతంలో అతడు జపాన్ నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేశాడు. 2005లో సైన్యం నుంచి వైదొలిగాడు.
కాల్పులు జరిపిన క్షణాల్లోని అతడిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం విచారించారు. ఈ విచారణలో నిందితుడు యమగామి టెట్సుయా ‘షింజో అబే తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యానని..అందుకే చంపాలని నిర్ణయించుకున్నానని పక్కా ప్లాన్ తో నే కాల్పులు జరిపానని వెల్లడించాడు. అతను బూడిద రంగు టీషర్టు, బ్యాగీ ట్రౌజర్ ధరించిన ఆ వ్యక్తి షింజో అబేకు అత్యంత సమీపానికి వచ్చి కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ఒకటి మెడలోకి, మరొకటి కాస్త కిందుగా ఎడమవైపు ఛాతీకి సమీపంలో దూసుకెళ్లినట్టుగా వెల్లడైంది.
షింజో అబే హత్యాయత్నం పట్ల పలు దేశాధినేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రగాఢ సంతాపం తెలిపారు. జపాన్‌లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలున్నాయి. జపాన్ లో తుపాకీ లైసెన్స్ పొందాలంటే చాలా చాలా కష్టతరం. దీంట్లో భాగంగా మొదట షూటింగ్ అసోసియేషన్ నుంచి సిఫారసును పొందాలి. ఆ తర్వాత పోలీసులు కఠినమైన నిబంధనలను దాటుకొని తుపాకీ లైసెన్స్ ను పొందుతారు. అటువంటి జపాన్ లో జరిగిన హత్య పట్ల జపాన్ ప్రజలతో పాటు ప్రపంచ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కాల్పులను “అత్యంత బలమైన పదాలు” లో ఈ ఘటనను ఖండించారు.