జపాన్ సునామీ హెచ్చరికల ఎత్తివేత.. ముమ్మరంగా సహాయ పునరావాస కార్యక్రమాలు

కొత్త సంవత్సరం రోజున సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్‌లో ఉన్న అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వాతావరణ సంస్థ అధికారి మంగళవారం తెలిపారు....

Japan's earthquake

Japan earthquake : కొత్త సంవత్సరం రోజున సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్‌లో ఉన్న అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేసినట్లు వాతావరణ సంస్థ అధికారి మంగళవారం తెలిపారు. మీటర్-ఎత్తైన అలలు తీరాన్ని తాకిన తర్వాత, జపాన్ అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేసింది. భూకంపం అనంతరం కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిన పడవలు, కాలిపోయిన గృహాలు దర్శనమిచ్చాయి.

ALSO READ : Plane catches fire : మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. 367 మంది ప్ర‌యాణీకులు..

7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాత రైల్వేస్టేషన్ వద్ద కంపించిన డిస్ ప్లే బోర్డులు, కుంగిపోయిన రోడ్లు, పగుళ్లతో కూడిన రోడ్ల వీడియోలు దర్శనమిచ్చాయి. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఆర్మీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది,పోలీసు అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు భూకంపం సంభవించిన ప్రాంతాలకు తరలివెళ్లారు. రన్ వే పగుళ్ల కారణంగా ఓ విమానాశ్రయాన్ని మూసివేశారు.