స్పీకర్ తో పాటు పార్లమెంట్ లో హెల్మెట్లు పెట్టుకున్న ఎంపీలు..!!

  • Publish Date - November 29, 2019 / 06:18 AM IST

పార్లమెంట్ లో ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు..! ఎంపీలు మాత్రమే కాదు పార్లమెంట్ స్పీకర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. ఎంపీలు హెల్మెట్లు పెట్టుకున్నారు అంటే ఏదో విషయంపై నిరసన వ్యక్తం చేయటానికి అని అనుకోవచ్చు. కానీ సభాపతి కూడా హెల్మెట్ పెట్టుకున్నారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది కదూ..మరి అదేంటో..ఎక్కడో తెలుసుకుందాం..
ఈ వింత ఘటన జపాన్ పార్లమెంటు జరిగింది. నిరసన కోసం కాదు..భూకంపాల నుంచి తమని తాము రక్షించుకోవడం కోసమట. జపాన్‌ ని భూకంపాల దేశం అని కూడా అంటుంటాం. ఎందుకుంటే అక్కడ తరచుగా భూకంపాలు ఏర్పడుతుంటాయి. 

ఈక్రమంలో ఎంపీలు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన నియమాల సభలో చర్చ నిర్వహించారు. దానికి సంబంధించి ఇటీవల ఎర్త్‌కేక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరికొత్త ఫోల్డబుల్ హెల్మెట్లను ఆవిష్కరించారు. ఫోల్డ్ చేసే ఫెసిలిటీ ఉన్న ఈ హెల్మెట్లను బ్యాగుల్లో కూడా పెట్టేసుకోవచ్చు. భూకంపం రాగానే వాటిని తెరిచి తలకు పెట్టేసుకుంటే చాలు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. 

ఈ సందర్భంగా స్పీకర్ తడమోరీ ఒషిమా మాట్లాడుతూ.. పార్లమెంటులో సభ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే..ఏం టెన్షన్ పడొద్దు..మీ డెస్కుల్లో హెల్మెట్లు ఉన్నాయి వెంటనే వాటిని పెట్టేసుకోండి..అని చెప్పారు. దీంట్లో భాగంగా..స్పీకర్ తన దగ్గర ఉన్న హెల్మెట్ ను పెట్టుకున్నారు. తరువాత సభలోని ఎంపీలంతా తమ డెస్కుల్లో ఉన్న హెల్మెట్లను పెట్టుకున్నారు. ఇదన్న మాట పార్లమెంట్ లో స్పీకర్ తో సహా ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్న విషయం.  

కాగా..జపాన్ పార్లమెంటులో ప్రమాదాల వల్ల ప్రజా ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు 2017న సేఫ్టీ కిట్స్ ను కూడా పార్లమెంట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్‌లో తాజాగా ఫోల్డింగ్ హెల్మెట్‌ను కూడా చేర్చారు. ఈ విషయాన్ని స్పీకర్ ఎంపీలకు తెలిపిన సందర్భంగా ఇలా అందరూ హెల్మెట్లను పెట్టుకున్నారు.

కాగా..మార్చి 2011 లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీకి సంభవించిది. ఈ సునామీ 20 వేలమందికిపైగా ప్రాణాల్ని బలి తీసుకుంది.