Japan Birth Rate: పిల్లల్ని కనకపోతే జపాన్ కనుమరుగవుతుంది.. జననాల రేటు తగ్గుదలపై ప్రభుత్వం ఆందోళన

జపాన్‌లో ఇటీవల జననాల రేటు భారీగా తగ్గుతోంది. మరణాల సంఖ్యలో సగం కంటే తక్కువగా జననాల సంఖ్య ఉంటోంది. దీంతో జనాభా కూడా తగ్గుతోంది. అక్కడి వాళ్లు కెరీర్ కోసం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. గత ఏడాది జపాన్‌లో 1.58 మిలియన్ల మంది మరణిస్తే, జన్మించిన వారి సంఖ్య 8,00,000గా ఉంది.

Japan Birth Rate: జపాన్‌లో జననాల రేటు భారీగా తగ్గుతుండటంపై అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే జపాన్ కనుమరుగవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా సలహాదారు మసాకో మోరి కీలక వ్యాఖ్యలు చేశారు.

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

సోమవారం ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్‌లో ఇటీవల జననాల రేటు భారీగా తగ్గుతోంది. మరణాల సంఖ్యలో సగం కంటే తక్కువగా జననాల సంఖ్య ఉంటోంది. దీంతో జనాభా కూడా తగ్గుతోంది. అక్కడి వాళ్లు కెరీర్ కోసం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. గత ఏడాది జపాన్‌లో 1.58 మిలియన్ల మంది మరణిస్తే, జన్మించిన వారి సంఖ్య 8,00,000గా ఉంది. ఇంత తక్కువ స్థాయిలో జననాలు నమోదు కావడం ఇటీవల ఇదే మొదటిసారి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Women’s Day: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

దీనిపై మసాకో మోరి మాట్లాడుతూ ‘‘జననాల సంఖ్య ఇలాగే తగ్గితే జపాన్ కనుమరుగవుతుంది. జననాల సంఖ్య తగ్గడం దేశానికి ఎంతో హాని చేస్తుంది. దేశం స్థిరత్వాన్ని కోల్పోతుంది. జననాల సంఖ్య క్రమంగా తగ్గడం కాదు.. ఒకేసారి భారీగా తగ్గిపోతోంది. అందుకే ప్రధాని కుటుంబ సంక్షేమం, పిల్లల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. దీని కోసం వెచ్చించే నిధుల్ని కూడా రెట్టింపు చేస్తున్నారు’’ అని మసాకో అన్నారు. దశాబ్దంన్నర కాలంలో జపాన్ జనాభా భారీగా తగ్గిపోయింది.

2008లో 128 మిలియన్ల జనాభా ఉండగా, ఇప్పుడు 124.6 మిలియన్లు మాత్రమే ఉంది. జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలకు సిద్ధమవుతోంది. పిల్లల సంరక్షణకు అధిక నిధులు కేటాయించడం, పిల్లల్ని కన్నవాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పిల్లలు ఉన్నవారికి ఉద్యోగంలో అదనపు సెలవులు, సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోబోతుంది.