బైడెన్ అనే నేను.. 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం

Joe Bien takes oath as President of the United States : అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్‌, హారిస్‌లు తమ భాగస్వాములతో కలిసి యూఎస్‌ క్యాపిటల్‌ భవనం వద్దకు చేరుకున్నారు. ముందుగా అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల బైబిల్ పై బైడెన్ ప్రమాణం చేశారు. క్యాపిటల్ భవనాన్ని చేరుకున్న జో బైడెన్ చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.

అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం :
మరోవైపు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమల హారిస్ ప్రమాణం చేశారు. కమలా హారిస్ తల్లి స్వస్థలం తమిళనాడు, తండ్రి స్వస్థలం జమైకా కాగా.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళగా కమలా హారిస్ అవతరించారు. బైడెన్ అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరు కాబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అమెరికా చరిత్రలో ఇలా జరగడం రెండోసారి. బైడెన్ ప్రమాణ స్వీకారానికి జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, ఒబామా దంపతులు హాజరయ్యారు. 25వేల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి వెయ్యి మంది అతిథులకు ఆహ్వానం పలికారు.

అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచింది.. కొత్త చరిత్ర ప్రారంభమైంది : బైడెన్
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. అమెరికా ప్రజలనుద్దేశించి అధ్యక్షుడు బైడెన్ ప్రసంగించారు. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని ఆయన అన్నారు. ఇది అమెరికా ప్రజలందరని విజయంగా అభివర్ణించారు. ఎన్నో సవాళ్ల నుంచి మనం ఎదగలన్నారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని బైడెన్ అన్నారు.

అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిందని, అగ్రరాజ్యం ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉందని బైడెన్ తెలిపారు. ఇటీవల పార్లమెటుపై దాడి దురదృష్టకరమైన చర్యగా పేర్కొన్నారు. తీవ్రవాదానికి అమెరికాలో చోటు లేదన్నారు. అమెరికా ప్రజల కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో అమెరికాలో లక్షల్లో ఉద్యోగాలను కోల్పోయామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మన ముందున్న లక్ష్యంగా బైడెన్ చెప్పారు.

అమెరికాలో ఇప్పటికే ఎన్నో అవరోధాలను ఎదుర్కొందని బైడెన్ గుర్తు చేశారు. తీవ్రవాదానికి అమెరికాలో చోటు లేదన్నారు. ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ద్వేషం, అవిశ్వాసాలపై పోరాడి గెలిచామని తెలిపారు. యుద్ధం కంటే శాంతికే ప్రాధాన్యత ఇస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ దేశానికే గర్వకారణమన్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్ చేయూతనివ్వాలని బైడెన్ సూచించారు.

నాలుగేళ్లుగా అమెరికా ప్రజలు చాలా హింసించబడ్డారన్న ఆయన.. ఈ దేశంలో వివక్షకు స్థానం లేదని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. యూనిటీ ఉంటేనే దేశాన్ని అభివృద్ధి చేయగలమన్నారు. కరోనా వల్ల ఆర్థిక రంగం కుదేలైందని, దేశంలో హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం లేకుండా చేయాలని బైడెన్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు