అమెరికా ఎన్నికల్లో మొదటి ఫలితం.. జో బిడెన్‌కే ఆధిక్యం

  • Publish Date - November 3, 2020 / 04:27 PM IST

పోరాటాలు.. ప్రసాంగాలు.. తిట్లు, సిగపట్లు ముగిసిన తర్వాత ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ఫలితం బయటకు వచ్చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తొలి ఫలితాల్లో మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ యుఎస్-కెనడా సరిహద్దు వెంబడి ఉన్న న్యూ హాంప్‌షైర్ టౌన్‌షిప్ అయిన డిక్స్‌విల్లీ నాచ్‌లో పోలింగ్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఐదు ఓట్లను గెలుచుకున్నారు. ఇది అధ్యక్ష ప్రాధాన్యతనిచ్చే దేశంలో మొదటి ప్రదేశాలలో ఒకటి.

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది తొలి ఫలితం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లె నాచ్‌లో జో బిడెన్ మొత్తం 5ఓట్లను సాధించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. వాస్తవానికి 2016 ముందు వరకు ఇక్కడ గెలిచిన అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. అయితే 2016ఎన్నికల్లో ఇక్కడ ఆ సెంటిమెంట్ మారింది. ఇక్కడ గెలిచిన హిల్లరీ క్లింటన్ కాకుండా ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు. 2016 ఎన్నికల సమయంలో ఈ నగరంలో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. వారిలో నలుగురు హిల్లరీ క్లింటన్‌కు, ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేశారు.

సాంప్రదాయం ప్రకారం, అర్హతగల ఓటర్లు అందరూ అర్ధరాత్రి ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమ రహస్య బ్యాలెట్లను వేయడానికి డిక్స్ విల్లె నాచ్ లోని ది బాల్సమ్స్ రిసార్ట్ లోని “బ్యాలెట్ రూమ్”లో సమావేశం అవుతారు. ప్రతి బ్యాలెట్ వేసిన తర్వాత, ఓట్లు లెక్కించబడతాయి మరియు ఫలితాలు ప్రకటించబడతాయి. సమీపంలోని మిల్స్‌ఫీల్డ్ కూడా అర్ధరాత్రి తన ఎన్నికలను ప్రారంభించింది. ఇక్కడ మాత్రం ట్రంప్ మిడెన్స్‌ఫీల్డ్‌ను 16-5తో బిడెన్‌పై గెలిచాడు.

కరోనా మహమ్మారి, అమెరికాలో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సమస్యలు.. వంటి అంశాలతో ప్రధానంగా సాగిన ఎన్నికల్లో అమెరికన్ పౌరులు తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. మరోసారి ట్రంప్‌కే సారథ్య బాధ్యతలు ఇస్తారా..? లేక వైట్‌హౌస్ పగ్గాలను జో బైడెన్‌కు అందిస్తారా..? అన్నది తేలాలంటే.. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో సగానికి సగం దక్కించుకున్నవారినే అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

ఈసారి ఎన్నికల్లో జో బిడెన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అన్నీ సర్వేలు ప్రకటించాయి, అయితే 2016 ఎన్నికల్లో కూడా హిల్లరీ క్లింటనే గెలుస్తారంటూ పెద్ద ఎ్తతున సర్వేలు ప్రకటించాయి. సర్వేలు ప్రకటించినట్టుగానే ఆమెకు ప్రజాదరణ ట్రంప్ కంటే ఎక్కువే ఉన్నా కూడా ఓట్ల శాతంలో కనిపించినా.. ఎలక్ట్రోరల్ ఓట్ల విషయంలో మాత్రం వెనుకబడ్డారు. అనూహ్య రీతిలో ట్రంప్ అత్యధిక ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించి అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.

విజేతను నిర్ణయించేది ఎవరు ?
వాస్తవానికి మన దేశంలో మాదిరిగా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఓట్లు సాధించినంత మాత్రాన అమెరికా అధ్యక్షులు కాలేరు. 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ విషయంలో ఇదే జరిగింది. ఎలక్ట్రోరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలవుతారు. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి. ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు. అమెరికాలో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేతగా నిలుస్తారు.