ఘనంగా 80వ పెళ్లిరోజు : ప్రపంచంలోనే వృద్ధ దంపతులు గిన్నిస్ రికార్డ్

  • Publish Date - December 27, 2019 / 05:52 AM IST

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులుగా గిన్నిస్ రికార్డు సృష్టించారు జాన్ హెండర్సన్‌, షార్లెట్ లు. టెక్సాస్ కు చెందిన వీరికి 1939 డిసెంబర్ 22న వివాహం జరిగింది. గత డిసెంబర్ 22న వీరు తమ 80వ పెళ్లి రోజును ఎంతో  సంతోషంగా..ఆనందంగా..ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 

మనస్సు నిండా సంతోషం ఉంటే మొహంపై ఎంతో ప్రశాంతమైన సంతృప్తి కరమైన చిరునవ్వు ఉంటుంది. అటువంటి సంతోషకరమైన చిరునవ్వుతో  కనిపిస్తున్న వీరిద్దరు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులు. ఇటీవలే తమ 80వ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్న జాన్‌ 1912, కార్లొట్టె 1914లో జన్మించారు. అంటే జాన్ వయస్సు 106 సంవత్సరాలు. షార్లెట్ వయస్సు 105. డిసెంబర్ 22న వారి 80వ పెళ్లి రోజు చేసుకున్న సందర్భంగా..ఎంతో అన్యోన్యంగా అంతకాలం కలిసి మెలిసి దంపతులుగా జీవించిన వారిని అభినందించటానికి స్నేహితులు..బంధుమిత్రులే కాక స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని అభింనందనల్లో ముంచెత్తారు. వీరిద్దరూ మొదటిసారి టెక్సాస్ యూనివర్శిటీలో 1934న కలిసారు.  వారి కలిసి నాలుగు సంవత్సరాలకు అంటే 1939న వివాహం చేసుకున్నారు. 

వీరిద్దరికీ 1939 డిసెంబరు 22న వివాహం జరిగింది. వీరిని ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా (జీవించి ఉన్న) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గత నవంబరులో గుర్తించింది. దంపతులుగా అత్యధిక కాలం జీవించిన రికార్డు జెల్మీరా, హెర్బర్ట్‌ ఫిషర్‌ పేరిట ఉంది. వారు 86 సంవత్సరాల 290 రోజులు దంపతులుగా ఉన్నారు. హెర్బర్ట్‌ 2011లో చనిపోయారు. 

కాగా..చిన్న చిన్న కారణాలకే విడిపోయే నేటి తరం జంటలు వీరిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వివాహం అంటే ఏదో మూడు ముళ్లు వేసుకుని త్రిపుల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకుని బతికేయటం..విభేదాలు వచ్చి విడిపోవటం కాదు..కష్టాలు వచ్చినా..ఇబ్బందులొచ్చినా ఒకరికి ఒకరుగా కలిసి బ్రతకటం..ఒకరిని ఒకరు గౌరవించుకోవటం అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  అటువంటి జీవితాన్ని గడిపిన..ఆస్వాదించిన జాన్ హెండర్సన్‌, షార్లెట్ లు ఎంతోమంది భార్యాభర్తలు ఆదర్శం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.