MPs fight In Parliament : పార్లమెంట్ లో ఎంపీలు బాహాబాహి..గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు

పార్లమెంట్ లో ఎంపీలు గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు.రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా విచక్షణ మరచిపోయిన ఎంపీలు ఒకరినొకరు కొట్టుకున్నారు.

mps in fight at  jordan parliament అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తీవ్ర దూషణలు చేసుకోవటం వింటునే ఉన్నాం. పార్లమెంట్ లో ఎంపీలు తీవ్ర విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలుచేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా?అదికూడా చట్టసభల్లోనే కొట్టుకోవటం చూస్తే వీరా ప్రజాప్రతినిధులు అని అనుకోకుండా ఉండలేం. అదే జరిగింది జోర్ధాన్ పార్లమెంట్ సమావేశాల్లో. ఎంపీలు బాహాబాహికి దిగి..ఒకరి షర్టు కాలర్లు మరొకరు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టుకున్నారు.

జోర్ధాన్ పార్లెమెంట్ లో మంగళవారం (డిసెంబర్ 28,2021) రాజ్యాంగ సవరణ బిల్లు కోరుతు ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీలు విచక్షణ మరచిపోయారు. తీవ్రస్థాయిలో తిట్టుకుంటూ గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారు. పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఈ ఘటనలో స్పీకర్ అబ్దుల్ కరీమ్ దుగ్బీ, డిప్యూటీ జులేమాన్ అబూ యాయా మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఈ క్రమంలో సులేమాన్ హౌజ్ ను నడిపించటం స్పీకర్ అబ్దుల్ కు చేతకావటంలేదని విమర్శించారు.దీంతో కొంతమంది ఎంపీలు రెచ్చిపోయారు. బాహాబాహీకి దిగారు. ఇటువంటి పరిస్థితుల మధ్య స్పీకర్ సభను 30నిమిషాలు వాయిదా వేశారు.

రాజ్యంగంలోని రెండవ చాప్టర్ లో ఉన్న జోర్డానియన్ల విధులు, హక్కుల విషయంలో ‘‘మహిళా జోర్దానియన్లు’’ అనే కొత్త పదాన్ని కలిపారు. దీంతో మహిళా జోర్ధానియన్లు ఏంటీ..ఇది లింగ వివక్షకు దారి తీస్తుందని ఆ పదాన్ని తొలగించాలని కొంతమంది ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో కొంతమంది ఎంపీలు విచక్షణ మర్చిపోయి ఇష్టానురీతిగా తిట్టుకున్నారు. మాటలతోనే కాకుండా ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు