ESA JUICE Spacecraft : గురు గ్రహం గుట్టు విప్పటానికి నింగిలోకి ‘జ్యుస్’..

గురు గ్రహం గుట్టు విప్పటానికి నింగిలోకి దూసుకెళ్లింది ‘జ్యుస్’. గురు చుట్టు ఉండే చందమామలపై కూడా జ్యుస్ పరిశోధనలు చేయనుంది.

ESA JUICE Spacecraft

ESA JUICE spacecraft : గురు గ్రహం ( Jupiter) గుట్టు విప్పటానికి నింగిలోకి దూసుకెళ్లింది (JUICE)వ్యోమనౌక (spacecraft) గురుగ్రహంతో పాటు చందమామలపై కూడా జ్యుస్ వ్యోమనౌక పరిశోధనలు చేయనుంది. గురు గ్రహం చుట్టు పరిభ్రమిస్తున్న మూడు చంద్రుడలనపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (European Space Agency) (ESA) అమెరికా (US)లోని ఫ్రెంచ్‌ గయానా (French Guiana)నుంచి ఏరియాన్‌ రాకెట్‌ ద్వారా శుక్రవారం ‘జ్యూస్‌’ వ్యోమనౌకను ప్రయోగించింది.

జ్యుస్ పరిశోధనలో భాగంగా చంద్రుడిపై జీవం ఉందా లేదో తెలుసుకోవటం వంటివి చేయనుంది. ఈ జ్యుస్ వ్యోమనౌక గురు గ్రహాన్ని చేరుకోవడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఈ వ్యోమనౌక 2031 జులై నెలకు గురు గ్రహానికి చేరుకుంటుంది. ఇది అక్కడికి చేరుకున్నాక ఆ గ్రహం గురించి నిశితంగా పరిశోధిస్తుంది. గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, కాలిస్టో, గానీమీడ్‌ చందమామలపైనా పరిశోధనలు సాగించనుంది. అక్కడ జీవం ఉందా లేదో తెలుసుకోవటం ఈ మిషన్ లక్ష్యం.

ఆయా ప్రాంతాల్లో హిమమయంగా ఉండే వీటి ఉపరితలాల కింద సముద్రాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జలం ఉంటే జీవి ఉన్నట్లే. అందుకే అక్కడ జీవుల మనుగడకూ ఆస్కారం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ యాత్రలో జ్యూస్‌.. గానీమీడ్‌ను పరిభ్రమిస్తుంది. గానీమీడ్‌ను అధ్యయని చేస్తు అవి ఎలా ఏర్పడ్డాయి? విశాలమైన జోవియన్ వ్యవస్థలో ఎలా సరిపోతాయో నిర్ణయిస్తుంది. మరో గ్రహానికి చెందిన చందమామ చుట్టూ ఒక వ్యోమనౌక తిరగడం అదే మొదటిసారవుతుంది.

ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని 1609-1610లో ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో గురు గ్రహం చుట్టు మూలు లేదా నాలుగు చంద్రులు ఉన్నాయని గుర్తించారు. అందుకే వాటిని గెలీలియన చంద్రులు అని పిలుస్తారు. అవి మరొక గ్రహం చుట్టూ కనుగొనబడిన మొట్టమొదటి సహ ఉపగ్రహాలు.