Kate Middleton : యువరాణి కేట్ మిడిల్టన్‌కు క్యాన్సర్ చికిత్స.. పిల్లలకు మొదటగా ఆ విషయాన్ని ఎలా చెప్పారంటే?

Kate Middleton : ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత చికిత్సకు ముందు తన ముగ్గురు పిల్లలకు ఆ పరిస్థితిని ఎలా వివరించిందంటే?

Kate Middleton : బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తనకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని తన ముగ్గురు పిల్లలకు చెప్పేందుకు ఆమె చాలా సమయం తీసుకుంది. తనకు క్యాన్సర్ ఉందనే చేదు నిజాన్ని పిల్లలకు చెప్పేందుకు తొలుత ధైర్యం చాలలేదు. అయినప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి గురించి పిల్లలకు తెలియాలని భావించింది. అందుకే, యువరాజు ప్రిన్స్ విలియంతో చాలా సున్నితంగా పిల్లలకు వివరించినట్టు ఆమె వీడియో ద్వారా వెల్లడించారు. కేట్‌ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేయించుకునే విషయాన్ని ఇటీవలే ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాంతో, అప్పటివరకూ ఆమె ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

Read Also : Brain Bleed Symptoms : ‘బ్రెయిన్ బ్లీడ్’ అంటే ఏంటి? సద్గురు ఈ పరిస్థితి నుంచి ఎలా కోలుకున్నారు? అసలు లక్షణాలేంటి? నివారణ ఎలా?

విలియం తోడు.. ఎంతో ఓదార్పునిచ్చింది : 
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, మిడిల్టన్‌కు ప్రిన్స్ జార్జ్ (10), ప్రిన్సెస్ షార్లెట్ (8), ప్రిన్స్ లూయిస్ (5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి కేట్ వివరిస్తూ.. ‘క్యాన్సర్ నిర్ధారణ తర్వాత కిమో థెరపీ చేయించుకుంటున్నాను. మొదట క్యాన్సర్ ఉందని తెలియగానే షాక్‌ అయ్యాను. పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకున్నాం. ఆరోగ్య పరిస్థితి గురించి పిల్లలు అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాం. క్యాన్సర్ సర్జరీ తర్వాత కోలుకున్నాక కిమో థెరపీ చేయించుకున్నాను.

ప్రస్తుతం నేను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని పిల్లలకు భరోసా ఇచ్చాను. మీరు ఊహించినట్లుగా కొంత సమయం పట్టింది. క్యాన్సర్ చికిత్స తర్వాత కోలుకోవడానికి నాకు సమయం పట్టింది. ఈ కఠిన సమయంలో ప్రిన్స్ విలియం నా పక్కనే ఉండటం చాలా ఓదార్పుగా అనిపించింది. విలియం మా పట్ల చూపిన ప్రేమ ఎంతో విలువైనది. క్యాన్సర్ చికిత్స పూర్తయ్యేవరకు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతారని భావిస్తున్నాం’ అంటూ మిడిల్టన్ వీడియోలో తెలిపారు. 2011లో మిడిల్టన్, విలియం వివాహం చేసుకోగా.. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.

రాజకుటుంబంలో మిడిల్టన్ మూడో వ్యక్తి :
నివేదిక ప్రకారం.. ప్రిన్స్ విలియం ఫిబ్రవరి 27న విండ్సర్ కాజిల్‌లో గ్రీస్‌కు చెందిన గాడ్‌ఫాదర్ కింగ్ కాన్‌స్టాంటైన్ స్మారక సేవకు హాజరైనప్పుడు కేట్ క్యాన్సర్ నిర్ధారణ గురించి తెలిసింది. ప్రిన్స్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటినుంచి తన సతీమణి కేట్ వెంటే ఉంటూ కొన్ని వారాల పాటు రాజ విధులను కూడా పక్కనపెట్టేశారు. కింగ్ చార్లెస్, డచెస్ ఆఫ్ యార్క్ సారా తర్వాత క్యాన్సర్‌తో బాధపడుతున్న యూకే రాజకుటుంబంలో మిడిల్టన్ మూడో వ్యక్తి. అయితే, ఇప్పటికే విలియం తండ్రి ఛార్లెస్‌-3 క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు.

Read Also : Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్‌తో 45కిలోలు తగ్గిన నర్సు..!

ట్రెండింగ్ వార్తలు