మోడీ వ్యూహం : కెమ్ చో ట్రంప్ భారీ ఈవెంట్

  • Publish Date - February 12, 2020 / 07:04 PM IST

హౌడీ మోడీ ఈవెంట్ రికార్డు బద్దలు కొట్టేందుకు కెంచో ట్రంప్ అంటూ ప్రధానమంత్రి మోదీ రెడీ అయిపోయారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత పర్యటనకు రానున్న నేపధ్యంలో కెమ్ చో ట్రంప్ పేరుతో ఓ భారీ ఈవెంట్ సిద్దం చేస్తున్నారు.. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఈ నెల 24న
భారత పర్యటనకు రానున్న నేపధ్యంలో ఈ భారీ ఈవెంట్ సిద్దం చేస్తున్నారు.

గుజరాత్‌లోని అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ఇఁదుకు వేదిక కానుంది. 2019లో  హూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అంతేకాదు ట్రంప్ విజయానికి భారతీయులు సహకరించాలంటూ ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు కూడా..ఇప్పుడు భారత్‌లో ట్రంప్ గౌరవార్థం ఓ బహిరంగ నిర్వహిస్తోంది. కెమ్ చో ట్రంప్ అంటే ఎలా ఉన్నారు ట్రంప్ అని అర్ధం.. కెమ్ చో అంటే గుజరాతీ భాషలో ఎలా ఉన్నారని అడగడం..నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ట్రంప్ ఆయన్ని కలవడం కూడా ఇదే ప్రథమం.

మెలానియా ట్రంప్‌తో కలిసి డొనాల్డ్ ట్రంప్ భారత్ రానున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో రెండుదేశాల మధ్య అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ వ్యాపార సంబంధాలను పక్కనబెడితే. హౌడీ మోడీ ఈవెంట్‌కి ధీటుగా కెమ్ చో ట్రంప్ నిర్వహించాలని మోదీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా భారత్‌లో పాటు..విదేశాల్లోనూ తన  ఇమేజ్ పెంచుకోవడం మోదీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈనిర్వహణతో అంతర్జాతీయంగా కూడా భారత్ పేరు ప్రతిష్టలు మారుమోగుతాయనేది కూడా మరో కారణం.

 
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. గత ఏడాదే ప్రారంభమైన ఈ పనులు గత నెలలోనే పూర్తయ్యాయి. ఈ స్టేడియాన్ని ట్రంప్ స్వయంగా ఓపెన్ చేయనున్నారు.. దాని తర్వాత కెమ్ చో ట్రంప్ నిర్వహణతో అంతర్జాతీయంగా కూడా మారుమోగనుంది.

మొత్తం లక్షాపాతికవేల మంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేలా గుజరాత్ అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమం సందర్శనతో ప్రారంభం అయ్యే ట్రంప్ టూర్..అక్కడ్నుంచి డైరక్ట్‌గా ఫ్లైట్‌లోనే పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. స్టేడియం నుంచే మోదీ..ట్రంప్ సంయుక్త ప్రసంగం కూడా ఉండొచ్చని తెలుస్తోంది.