Kim Jong Un : నాలుగేళ్ల తర్వాత బుల్లెట్ ప్రూఫ్ రైలులో కిమ్ జోంగ్ రష్యాకు ప్రయాణం…విలాసవంతమైన రైలు విశేషాలు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-అన్ వ్లాడివోస్టాక్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశానికి ప్యోంగ్యాంగ్ నుంచి తన లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ సాయుధ రైలులో ప్రయాణించిన తర్వాత రష్యా చేరుకున్నారు. ఈ రైలు విశేషాలు తెలుసుకుందాం....

Kim Jong Bulletproof Train

Kim Jong Un in Russia : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-అన్ వ్లాడివోస్టాక్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశానికి ప్యోంగ్యాంగ్ నుంచి తన లగ్జరీ సాయుధ రైలులో ప్రయాణించిన తర్వాత రష్యా చేరుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి కిమ్ విదేశీ పర్యటన జరిపారు. కొవిడ్ -19 మహమ్మారి తర్వాత కిమ్ జోంగ్ జరిపిన మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. నెమ్మదిగా వెళుతున్న ఆకుపచ్చ, పసుపురంగు రైలులో కిమ్ 1,180 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ రైలు విశేషాలు తెలుసుకుందాం రండి.

Union Minister VK Singh : పాక్ ఆక్రమిత కశ్మీరుపై కేంద్రమంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

అత్యంత విలాసవంతమైన ఈ రైలులో కిమ్ 20 గంటలు గడిపారు. (Kim Jong Un’s 90-Coach Bulletproof Train) అంతర్జాతీయ పర్యటనల విషయానికి వస్తే కిమ్ రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చారు. సాయుధ బలగాల పహరాలో పకడ్బందీ రక్షణ కారణంగా ఈ రైలు గంటకు 31 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నడిచింది. 90 బోగీలున్న ముదురు ఆకుపచ్చ రంగు రైలులో ప్రతీ బోగీ బుల్లెట్ ప్రూఫ్ చేశారు. దీంతో రైలు బరువు పెరిగింది.

Jammu And Kashmir : కశ్మీరులో ట్రక్కుపై పడిన బండరాయి…నలుగురి దుర్మరణం

అత్యంత విలాసవంతమైన ఈ రైలులో సమావేశ గదులు, బెడ్రూంలు, ఉపగ్రహ ఫోన్లు, బ్రీఫింగ్ కోసం ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ రైలులో ఖరీదైన ఫ్రెంచ్ వైన్, లైవ్ ఎండ్రకాయలు, పంది బార్బెక్యూలను రైలు రెస్టారెంటులో ఉంచారు. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ కూడా వియత్నాం, తూర్పు ఐరోపా దేశాలకు రైలులోనే ప్రయాణించారు. కిమ్ జోంగ్ తాత విమానంలో ప్రయాణించాలంటే భయపడేవారు. దీంతో రైలులోనే ప్రయాణించేవారు.

IMD Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు…యూపీలో 19 మంది మృతి

2001వ సంవత్సరంలో మిస్టర్ పుతిన్‌తో సమావేశాన్ని నిర్వహించడానికి మాస్కోకు 10 రోజులు ప్రయాణం సాగించారు. భద్రతా ఏజెంట్లు ఈ విలాసవంతమైన రైలుకు కాపలాగా ఉన్నారు. భద్రత దృష్ట్యా స్టేషన్లను స్కాన్ చేస్తారు. ఉత్తర కొరియా యొక్క ప్రస్తుత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా తన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించారు. విమానం కంటే సాయుధ రైలు మరింత భద్రతతోపాటు విలాసవంతమైనదని నమ్ముతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి వియత్నాం చేరుకోవడానికి కిమ్ జోంగ్ తన రైలులో చైనా గుండా 4,500 కిలోమీటర్లు ప్రయాణించారు.

తయాంఘో ప్రత్యేక రైలు

కిమ్ జోంగ్ రైలు పేరు తయాంఘో అని పిలుస్తారు. తయాంఘో అంటే కొరియా భాషలో సూర్యుడు అనే అర్థం. సాయుధ దళాల రక్షణతో నడుస్తున్న ఈ రైలు స్టేషనుకు చేరుకునే ముందు దాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తారు. ఈ రైలులో కొరియన్, రష్యన్, చైనీస్, జపనీస్, ఫ్రెంచి వంటకాలను కూడా వండి వారుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన రెడ్ వైన్ కూడా రైలులో సర్వ్ చేస్తారని ఈ రైలులో ప్రయాణించిన రష్యన్ కమాండర్ చెప్పారు.