కిమ్ కర్దాశియన్‌కు మూడోసారి విడాకులు కావాలంట

Kim Kardashian: రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాశియన్ కు విడాకులు కావాల్ట. ర్యాపర్ కన్యే వెస్ట్ తో ఏడు సంవత్సరాల పాటు కొనసాగించిన వివాహబంధం నుంచి విడాకులు కావాలని అడుగుతుంది. రెగ్యూలర్ రిలేషన్ షిప్ ఇష్యూస్ తో ఆ జంట విడిగా ఉంటున్నారని అడిగిన కొద్ది కాలానికే విడాకుల వరకూ వెళ్లిపోయారు.

ఆ తర్వాత కర్దాశియన్ 40, వారిద్దరికీ పుట్టిన నలుగురి సంతానాన్ని జాయింట్ కస్టడీలో ఉంచాలని కోరుతుంది. ఈ విషయాన్ని కర్దాశియన్ లాయర్ కన్ఫామ్ చేసినా.. పూర్తి వివరాలు వెల్లడించలేదు. 2012లో డేటింగ్ స్టార్ చేసి ఈ జంట రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.

మెంట్ హెల్త్ ఇష్యూస్ కారణంగానే.. విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. 43ఏళ్ల ఆమె భర్త వెస్ట్ కు.. బైపోలార్ డిజార్డర్ ఉందని దాని కారణంగా ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించారు.

ఆమె భర్తకు తొలిసారి డైవర్స్ తీసుకోవడం కావడంతో కాస్తంత ఎమెషనల్‌గా ఉన్నా కర్దాశియన్ కు ఇవి తొలి విడాకులేం కాదు. గతంలో రెండు సార్లు వివాహ బంధానికి బ్రేక్ చెప్పేసింది. యూఎస్ రియాలిటీ టీవీ సిరీస్ తో ప్రేక్షకులు దగ్గరైన కర్దాశియనకు నలుగురు పిల్లలు ఉన్నారు.

విడాకులపై స్పందించిన అతని భర్త వెస్ట్ మాట్లాడుతూ.. తన నుంచి పిల్లలను విడదీయొద్దంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. 2013లో వీరికి తొలి సంతానం కలుగగా ఏడాది తర్వాత వీరి వివాహం ఫ్లోరెన్స్ లో జరిగింది. ఫ్రాన్స్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు.