Kitchen Fire 4 Year Old Florida Girl Spots Fire In The Kitchen
Kitchen Fire : నాలుగేళ్ల పాప ఇంట్లో ఆడుకుంటోంది. తండ్రి వాష్ రూంలో ఉన్నాడు. ఇంట్లో కిచెన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఆడుకుంటున్న పాప కంగారుపడింది. వెంటనే పేరంట్స్‌ను అలర్ట్ చేసింది. అదృష్టవశాత్తూ సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. చిన్నారి తండ్రి Daniel Patrick Jermyn తన ఇన్ స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేశాడు.
కిచెన్ లో మంటలు వ్యాపించిన సమయంలో చిన్నారి Amelia డిస్నీ ఫిల్మ్ Frozenలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తోంది. మంటలను గమనించిన చిన్నారి వెంటనే.. ఫైర్.. ఫైర్.. డాడ్. అది నన్ను చంపేస్తోంది అంటూ అరుస్తూ బయటకు పరుగులు తీయడాన్ని వీడియోలో చూడొచ్చు. దాంతో వాష్ రూంలో ఉన్న డానియల్ వెంటనే బయటకు వచ్చాడు. బాత్ రూంలోకి వెళ్లి నీళ్లను తీసుకొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు.
అనంతరం ఎయిర్ ఫ్రయిర్ దాన్ని ఫూల్ లో పడేశాడు. కిచెన్ లోకి వచ్చిన డానియల్.. మంటలను అర్పేశాడు. అనంతరం డానియల్ మాట్లాడుతూ.. తన కూతురే ఇంటిని, తమను కాపాడిందని చెప్పాడు. ఎయిర్ ఫ్రయిర్ షాట్ లో సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలిపాడు. వెనుకవైపు పాట పెద్దగా వస్తున్నప్పటికీ కిచెన్ లో మంటలను గమనించిందని, నిజంగా తన పాప రియల్ హీరో అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మంటలను ఆర్పే ప్రయత్నంలో డానియల్ కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంట్లోని పెంపుడు కుక్కలతో పాటు కుటుంబమంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిపాడు. గారాల పట్టి అమెలియాకు ధన్యవాదాలు తెలిపాడు.