Kurdish people protested in Paris
Paris : ఫ్రాన్స్ రాజధాని పారిస్ హింసాత్మక ఘటనలతో రగిలిపోతోంది.గత శుక్రవారం (డిసెంబర్ 24,2022) పారిస్ లో కుర్ధిష్ కమ్యూనిటీ పై జాతి వివక్షతో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అప్పటి నుంచి పారిస్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఎక్కడోక చోట నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తునే ఉన్నారు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. మూడు నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ అల్లర్లలో 30మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులు పలువాహనాలను ధ్వంసం చేశారు. షాపులు లూటీ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో 30మంది పోలీసులకు, నిరసనకారులకు కూడా గాయాలయ్యాయి.
పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనలు జరుగుతున్న రిపబ్లిక్ స్క్వేర్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ హింసాత్మక నిరసనల్లో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిరసనకారులు వందలాది మంది కుర్దిష్ నిరసనకారులు జెండాలు పట్టుకొని మృతులకు నివాళులర్పించారు.