కరోనా వైఫల్యాలను లాక్‌డౌన్‌తో చైనా కవర్ చేసింది… లీకైన రహాస్య పత్రాలు!

  • Publish Date - April 17, 2020 / 12:13 PM IST

కరోనా వైఫల్యాలను లాక్‌డౌన్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది చైనా. కానీ, ఎంత దాచిన రహాస్యాలు దాగవు కదా.. చైనా గుట్టు బయటపడింది.. డ్రాగన్ ఎంత దాచాలని ప్రయత్నించినా అసలు రహాస్య పత్రాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. చైనా వైఫల్యాల కారణంగానే ఈ రోజు ప్రపంచ దేశాలు కరోనా మమహ్మారితో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మరణాలు, లక్షల్లో కేసులు నమోదుతూనే ఉన్నాయి. 

కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై చైనా వైఫల్యాలను రెండు దశల్లో విశ్లేషించాలి. డిసెంబర్ నుంచి కరోనా వైరస్ ప్రారంభమైన రోజుల నుంచి జనవరి మూడో వారం వరకు, జనవరి 23 నుంచి వుహాన్ సిటీలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకూ అన్నింటిపై నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కరోనా రెండో దశ ఎలా ఉందో అందరికి తెలిసిందే. కఠినమైన లాక్ డౌన్, క్వారంటైన్ ప్రక్రియ, ఆస్పత్రి సౌకర్యాలను యుద్ధ ప్రాతిపాదికన పెంచడం… చైనా తరహాలో ఇతర దేశాలు సైతం అనుసరించడం వంటి చకచకా జరిగిపోయాయి.

కానీ, ఇప్పుడు చైనా కరోనా ప్రారంభ కీలక రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టింది? ఏ విధంగా డ్రాగన్ స్పందించింది? లాక్ డౌన్ ముందు చైనా వైఫల్యాలేంటి అనే అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కొన్ని అంతర్గత డాక్యుమెంట్ల ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్.. కరోనా కట్టడిపై చైనా వైఫల్యాలను బయటపెట్టింది. ఇవి ఫారెన్ నేషన్ (CIA) నివేదికలు కావని గుర్తించుకోండి. కానీ, చైనాలోని అంతర్గత డాక్యుమెంట్లుగా సంబంధిత నివేదికలు వెల్లడించాయి. 

6 రోజుల ఆలస్యం.. 3వేలకు పైగా సోకింది :
జనవరి 14న టాప్ చైనా అధికారులంతా తాము కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నామనే నిర్ణయానికి వచ్చారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధినేత Ma Xiaowei రహస్య టెలికాల్ఫిరెన్స్‌లో ప్రావిన్సిషయల్ హెల్త్ అధికారులతో మాట్లాడారు. ‘కరోనా వైరస్ ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంది. క్లిష్టమైన పరిస్థితులివి. 2003లో SARS సమయంలో సవాళ్లనే ఇప్పుడు ఎదుర్కోవాల్సిన సమయం ఇది.

ప్రధాన ప్రజారోగ్య వ్యవస్థలోకి వృద్ధిచెందే అవకాశం ఉంది. ఆరు రోజులు ఆలస్యంగా స్పందించిన చైనా.. వుహాన్ ఆతిథ్యమిచ్చిన ఓ విందు కార్యక్రమానికి వేలాది సంఖ్యలో మిలియన్ల మంది చైనీయులు ల్యూనర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో పాల్గొన్నారు. జనవరి 20న చైనా అధ్యక్షుడు Xi Jinping కరోనా వైరస్ వ్యాప్తిని తీవ్రంగా తప్పకుండా తీసుకోవాలంటూ ప్రజలను హెచ్చరించారు. అదే రోజున చైనీస్ ఎపిడెమోలిజిస్ట్ Zhong Nanshan నేషనల్ టెలివిజన్‌లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ఆయన ప్రకటించారు. కానీ, అప్పటికే ఈ కరోనా వైరస్ 3వేల మందికి పైగా సోకింది. 

12 రోజులు నిశ్శబ్దం.. డ్రాగన్ కొంప ముంచింది : 
కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా 12 రోజుల పాటు నిశ్శబ్దంగా ఉంది. అదే అలస్యం.. వేలాది మంది ప్రాణాలకు కరోనా మహమ్మారి బలిగొంది. జనవరి 5 నుంచి జనవరి 17 వరకు చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ స్థానిక అధికారుల నుంచి ఎలాంటి న్యూమోనియా వంటి వ్యాధి సోకిన కేసులను నమోదు చేయలేదు. ఆ సమయానికే వైరస్ సోకిన వందలాది మంది రోగులు ఆస్పత్రుల్లో బారులు తీరారు.

అసలేం జరిగిందంటే? :
కేవలం ఒక వుహాన్ సిటీలో మాత్రమే కాదు.. చైనా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఒక్కసారిగా దేశంలో అనిశ్చితి నెలకొంది. ఈ వైరస్ వ్యాప్తిపై స్థానిక అధికారులు లేదా జాతీయ అధికారులు సైతం కరోనా కేసులను గుర్తించి రిపోర్టు చేయడంలో విఫలమయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కానీ, అసలేం జరిగిందో నిపుణులు స్పష్టతనిచ్చారు.

చైనా కరోనాపై సమాచారాన్ని తెలియనీయకుండా బ్యూరోక్రాటిక్ అడ్డంకులు, తప్పుడు వార్తలంటూ ముందస్తు హెచ్చరికలతో కఠినమైన నియంత్రణలను విధించినట్టు నివేదిక పేర్కొంది. SARS లాంటి ముప్పు కరోనా రూపంలో కాటేయబోతుందంటూ సోషల్ మీడియాలో స్నేహితులను హెచ్చరించినందుకు జనవరి 2న, చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థానిక అధికారులు 8 మంది వైద్యులను పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారంటూ శిక్షించారు. ఈ వైద్యులలో ఒకరైన డాక్టర్ లి వెన్లియాంగ్ ఫిబ్రవరి 7న మరణించారు.