Australia
Australia : ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మహిళ మెదడులో పారాసైట్ ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె అసాధారణ పరిస్థితులు ఎదుర్కుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కేసు ఊహించని మలుపు తిరిగింది.
Cheems: కూల్ స్టైల్ వైరల్ మీమ్ డాగ్ చీమ్స్ ఇక లేదు.. శస్త్రచికిత్స చేస్తుండగా ఆపరేషన్ టేబుల్‌పై మరణం
64 సంవత్సరాల వయసున్న ఆస్ట్రేలియన్ మహిళ మెదడులో పారాసైట్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాన్‌బెర్రాలోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ సేనానాయక్ ఈ దిగ్భ్రాంతికరమైన కేసు గురించి వివరించారు. ఈ కేసును డీల్ చేస్తున్న న్యూరో సర్జన్ తనను సంప్రదించిన సమయంలో ఈ విషయం బయటపడినట్లు ఆయన వెల్లడించారు.
గత రెండు సంవత్సరాలుగా ఆ మహిళ న్యుమోనియా, కడుపునొప్పి, అతిసారం, పొడి దగ్గు, జ్వరం, రాత్రి చెమటలు, డిప్రెషన్, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి అనేక లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 2022 లో MRI స్కాన్ అనంతరం వైద్య నిపుణులు శస్త్ర చికిత్స చేశారు. ఎరుపు రంగులో, 3 అంగుళాల పొడవు ఉన్న పారాసైట్‌ను బయటకు తీసారు. దీనిని శాస్త్రీయంగా ‘ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ’ అని పిలుస్తారు. ఈ ప్రత్యేక రకం పురుగు సాధారణ పాములతో సంబంధం కలిగి ఉంటుందట. అయితే మనిషిలో ఈ పారాసైట్ ఉండటం ఇదే మొదటి కేసుగా రికార్డుల్లోకెక్కింది.
israel : తెగిన తలను అతికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు .. వైద్య రంగంలో మిరాకిల్.
ఈ కేసులో మహిళకు పాములతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పాములు ఎక్కువగా తిరుగాడే సరస్సు ప్రాంతంలో నివసించిందట. వంట కోసం సేకరించిన న్యూజిలాండ్ బచ్చలికూర, ఇతర ఆకు కూరల ద్వారా పాము గుడ్లు ఆమె కడుపులోకి వెళ్లి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఎదుర్కున్న అరుదైన కేసు అయినప్పటికీ ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స తరువాత దీర్ఘకాలంపాటు ఆమెకు మందులు వాడాలని సూచించారు. ఈ కేసు చాలా అరుదైనదిగా న్యూరో సర్జన్లు చెబుతున్నారు.