Dr Simon Bramhall : రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన పేరు రాసుకున్న డాక్టర్

రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన పేరు రాసుకున్న డాక్టర్. ఇటువంటి డాక్టర్లను ఏం చేయాలో తేల్చి చెప్పిన ధర్మాసనం.

Doctor Simon Bramhall Autograph On Surgery Patient Liver

Doctor Simon Bramhall autograph on Surgery patient liver : చిత్రకారులు పెయింటింగ్ వేశాక కింత ఆర్ట్ బై అంటూ తమ పేరు రాసుకుంటారు. కానీ రోగులకు కాలేయ మార్పిడి చికిత్స చేసే ఓ డాక్టర్ తాను చిత్రకారుడి అనుకున్నాడో ఏమోగానీ..రోగికి కాలేయ మార్పిడి (లివర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​)సర్జరీ చేసి ఆ కాలేయంపై తన పేరు రాసుకుంటున్నాడు. దీంతో మెడికల్​ ప్రాక్టీషనర్స్​ ట్రైబ్యునల్​ సర్వీస్ సరదు డాక్టర్ పై నిషేధం విధించింది.

ఈ డాక్టర్ ఇలా ఒకసారి రెండుసార్లు కాదు కాలేయ మార్పిడి సర్జరీ చేసిన ప్రతీ సారి సదరు రోగి లివర్ పై తన సంతకం చేసేవాడు. యూకేలోని ‘బర్మింగ్‌హామ్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి’లో శస్త్రచికిత్స నిపుణుడిగా ఉన్న సమయంలో డా.సైమన్‌ బ్రామ్‌హాల్‌ ఓ రోగికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశాడు. 2013లో డాక్టర్ సైమన్​ బ్రామ్​హాల్​ బాగోతం బయటపడగా అతనిపై మెడికల్​ ప్రాక్టీషనర్స్​ ట్రైబ్యునల్​ సర్వీస్ విధించింది. ఆ తరువాత 2017లో తన చేసిన ఘనకార్యాన్ని అంగీకరించాడు.

Read more : Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!

రోగి లివర్ పై తన ఆటోగ్రాఫ్ రాసిన డాక్టర్​.. తన వృత్తికే అవమానకరమైన పని చేశాడు. తన పేరులోని మొదటి అక్షరాలతో రోగికి సర్జరీ చేసి అమర్చిన లివర్​పై సంతకంలా చేశాడు. దీంతో డాక్టర్ సైమన్​ బ్రామ్​హాల్​ పేరును.. మెడికల్​ రిజిస్టర్​ నుంచి తొలగించింది మెడికల్​ ప్రాక్టీషనర్స్​ ట్రైబ్యునల్​ సర్వీస్​​- ఎంపీటీఎస్. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తప్పించింది. సైమన్​ సర్జరీ చేసిన బాధితుడు హాస్పిటల్ నుంచి డిశార్జ్ అయి ఇంటికెళ్లిన కొద్దిరోజులకే మళ్లీ అస్వస్థతకు గురి అయ్యాడు. దీంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. అతడికి అత్యాధునిక స్కేనింగ్ నిర్వహించగా లివర్​పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలను గుర్తించాడు మరో డాక్టర్. సదరు బాధితుడికి కాలేయ మార్పిడి చేసిన సర్జరీ కూడా ఫెయిల్ అయినట్లుగా ఆ పరీక్షల్లోనే తెలిసింది.

2013 ఫిబ్రవరి, ఆగస్టులో.. ఇలా రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన సమయంలో వాటిపై తన ఇనీషియల్స్​ను రాసినట్లు డాక్టర్ సైమన్​ 2017లో అంగీకరించాడు. లివర్ పై తన పేరు రాయటానికి ఆర్గాన్​ బీమ్​ మెషీన్​ను ఉపయోగించానని డాక్టర్ తెలిపాడు. ఈ విషయం బయటకు తెలిసిన తరువాత సైమన్​ 2013లోనే కన్సల్టెంట్​ సర్జన్​ పోస్ట్​ నుంచి సస్పెండ్​ అయ్యాడు. విచారణ సమయంలోనే 2014లో బర్మింగ్​హామ్​ క్వీన్​ ఎలిజబెత్​ హాస్పిటల్​లో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా చేసిన రెండు కేసుల్లో డాక్టర్ సైమన్​ 13,619 డాలర్లు (రూ. 10 లక్షలకుపైనే) జరిమానా కట్టాలని..చేసిన నేరానికి పరిహారంగా డాక్టర్ సమాజ సేవ చేయాలని ఆదేశించింది ట్రైబ్యునల్​​. 2020 డిసెంబర్​లో మరోసారి కేసును సమీక్షించి.. మెడికల్​ ప్రాక్టీస్​ చేయకుండా 5 నెలలు సస్పెన్షన్​ విధించింది ఎంపీటీఎస్.

Read more : Tasnim Mir: చరిత్ర సృష్టించిన తస్నిమ్ మీర్.. భారత్‌లో ఎవ్వరూ చేరుకోలేని స్థానానికి!

కానీ అతనిలో మంచి మార్పు రావటంతో 2021 జూన్​లో అతడిపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేసింది.సస్పెన్షన్​పై ట్రైబ్యునల్​ నిర్ణయాన్ని హైకోర్టు జడ్జి తప్పుపట్టారు. ఇలాంటి నేరం చేసిన వ్యక్తిని కేవలం సస్పెండ్ చేయటమే కాదు వైద్య వృత్తి నుంచి పూర్తిగా తొలగించడమే సరైనదని..అదే అతడికి సరైన శిక్ష అని స్పష్టం చేశారు.

సైమన్ ‘ఆటోగ్రాఫ్’​ వల్ల రోగికి శారీరక సమస్యలు రాకపోయినా..అతనిని జీవితాంత ఓ విధమైన మానసిక సమస్య వేధిస్తునే ఉంటుందని గత సోమవారం (జనవరి 10,2022) జరిపిన విచారణలో మెడికల్​ ట్రైబ్యునల్​ కూడా పేర్కొంది. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తాజా తీర్పులో వెల్లడించింది. కాగా తనకు విధించిన ఈ శిక్షపై డాక్టర్ సైమన్ బ్రామ్ హాల్ కు 28 రోజుల్లోగా అప్పీల్​ చేసుకునే అవకాశం ఉంది. మరి డాక్టర్ అప్పీల్ చేసుకుంటారో లేదో వేచి చూడాలి.

Read more : అరుదైన ఆపరేషన్ : పెద్దతలతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు