Tasnim Mir: చరిత్ర సృష్టించిన తస్నిమ్ మీర్.. భారత్‌లో ఎవ్వరూ చేరుకోలేని స్థానానికి!

అండర్-19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది తస్నిమ్ మీర్.

Tasnim Mir: చరిత్ర సృష్టించిన తస్నిమ్ మీర్.. భారత్‌లో ఎవ్వరూ చేరుకోలేని స్థానానికి!

Tasnim Mir

Tasnim Mir: అండర్-19 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది తస్నిమ్ మీర్. గతేడాది అంతర్జాతీయ పోటీల్లో తస్నిమ్ మూడు పతకాలు సాధించగా.. ఫలితంగా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది.

గుజరాత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన తస్నిమ్ మీర్.. 16 ఏళ్ల వయసులోనే జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ 1 ప్లేయర్‌గా అవతరించింది. గతేడాది తన అద్భుతమైన ప్రదర్శన కారణంగా దేశంలోనే ఇంతటి ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి వెటరన్ ప్లేయర్లు కూడా జూనియర్ స్థాయిలో నంబర్ వన్ కాలేదు.

ఈ ప్రత్యేక విజయంపై తస్నీమ్ ఏం చెప్పింది?
“నంబర్ 1 ర్యాంకు వస్తుందని ఊహించలేదని, COVID-19 కారణంగా టోర్నమెంట్‌లు ప్రభావితం అవుతున్నందున నేను నంబర్ 1 కాలేనని అనుకున్నాను. కానీ బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలో జరిగిన మూడు ఈవెంట్‌లలో గెలవడంతో ఎట్టకేలకు ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచాను. అందుకు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాను.” అని తస్నీమ్ చెప్పుకొచ్చింది.

అండర్-19 రోజుల్లో సింధు ప్రపంచంలోనే నంబర్ టూ ప్లేయర్‌గా నిలిచినా నెంబర్ 1కి మాత్రం ఎప్పుడూ చేరుకోలేదు. తెలంగాణకు చెందిన సమియా ఇమాద్ ఫారూఖీ దగ్గరగా వచ్చినా కూడా రెండో స్థానానికి మాత్రమే పరిమితమైంది.