7ఏళ్ల నుంచి… ఉన్నచోట నుంచి ఒక్క అంగుళం కదల్లేదట

యూరప్ లోని బోస్నియా అండ్ హర్జిగోవినా బల్లిలా ఉండే ఓ జీవి చాలా ఏళ్లుగా ఒకే స్పాట్ లో రెస్ట్ మూడ్ లోనే ఉందంట. ఓల్మ్ గా కూడా పిలవబడే ఆ జీవి ఏడు సంవత్సరాలుగా ఉన్న చోటు నుంచి కదలడం లేదని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఓ అడుగు పొడవుతో ఉండి ఈ ప్రపంచంలో 100ఏళ్లకు పైగా జీవించగలిగే ఈ జీవి 2వేల 569 రోజుల నుంచి ఉన్నచోటు నుంచి కదలడం లేదంట.

అయితే ఈ విషయం తెలిసిన అందరూ ఇప్పుడు నోరు వెళ్లబెడుతున్నారంట. ఏంటబ్బా ఇది ఏడేళ్ల నుంచి కదలకుండా ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారు. యూరప్ లోని గుహలలో నివసించే ఓల్మ్స్ పాలిపోయిన చర్మంతో,అభివృద్ధి చెందని కళ్లతో జీవితం మొత్తం చీకటిలోనే ఉంటాయి. అయితే కళ్లు అభివృద్ధి చెందకపోవడమే అవి ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండటానికి కారణం కావచ్చు.

అయితే ఈ గుహ-నివాస సాలమండర్ లు ఒక ప్రదేశం నుండి సంవత్సరానికి కదలకుండా ఉండటం అసాధారణం కాదు. కానీ ఈ ఓల్మ్ మాత్రం పరిశోధకులను ఆశ్యర్యపరిచింది. ఏడేళ్లుగా ఈ జీవి దాని మూడు వేళ్ళలో ఒక్కటి కూడా ఎత్తలేదు. ఈ జీవులు నివసించే గుహల్లోఆహారం కొరత ఉంటుందని, కానీ చేయగలిగినప్పుడల్లా, ఓల్మ్స్ చిన్న రొయ్యలు, నత్తలు మరియు కీటకాలను అప్పుడప్పుడు తింటాయని ది ఇండిపెండెంట్ లో ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది. ఓల్మ్స్ తినకుండానే చాలా ఏళ్లు గడుపుతాయని, అవి చాలావరకు సామాజిక వ్యతిరేకమని, ఇతర జంతువులు వాటిపై వేటాడవని రిపోర్ట్ తెలిపింది.