Queen Elizabeth : 13 ఏళ్లకే ప్రేమలో పడిన క్వీన్ ఎలిజజెత్ .. పట్టుదలతో ప్రేమను గెలిపించుకున్న ధీర

13ఏళ్లకే ప్రేమలో పడిన క్వీన్ ఎలిబజెత్ .. పట్టుదలతో ప్రేమను గెలిపించుకున్న ధీర క్వీన్ ఎలిజబెత్.

Queen Elizabeth : పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు.. ప్రేమలో గెలిచింది అలానే ! జీవితాన్ని గెలిపించుకుంది అలానే ! ఎలిజబెత్ అంటే గుర్తుకు వచ్చే మాటలు ఇవి. రాచరికం అంతం అవుతున్నా.. ఎలిజబెత్ కుటుంబానికి బ్రిటన్‌లో ఎప్పుడూ గౌరవం తగ్గలేదు. ఐనా సరే వివాదాలు వెంటాడాయ్‌. విమర్శలు పలకరించాయ్. 70 ఏళ్ల పాలనాకాలో ఎలిజబెత్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి.. ఎలాంటి వివాదాలు ఎలిజబెత్‌ కుటుంబాన్ని పలకరించాయ్..

రాజవంశంలో పుట్టిన ఎలిజబెత్‌.. 13ఏళ్లకే ప్రేమలో పడింది. ఆ రోజుల్లోనే తన ప్రియుడికి ఉత్తరాలు రాసి పోస్టుల్లో పంపేవారు ఆమె. ఎవరు ఏమనుకున్నా లెక్కచేసేవారు కాదు. 13ఏళ్లకే అంత ధైర్యమా అంటే.. అలానే ఉంటుంది.. దటీజ్  ఎలిజబెత్ ! కామన్వెల్త్ దేశాలకు రాణిగా, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ధీరవనితగా చరిత్రలో ఓ పేజీ తనకంటూ పదిలం చేసుకున్నారు ఎలిజబెత్‌. తండ్రి మరణంతో రాణిగా బాధ్యతలు తీసుకున్న ఎలిజబెత్‌.. పాలనలో లౌక్యాన్ని ప్రదర్శించేవారు. ఉత్తర ఐర్లాండ్ సంక్షోభాన్ని, ఆస్ట్రేలియాలో రాజకీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించారు. 20కి పైగా దేశాలకు ఆమె స్వాతంత్ర్యం ప్రకటించారు. 1986లో చైనా, 1994లో రష్యా, 2011లో ఐర్లాండ్ దేశాల్లో ఎలిజబెత్‌ పర్యటనలు సరికొత్త చరిత్రకు కారణం అయ్యాయ్.

13 ఏళ్లకే ప్రేమలో పడిన ఎలిజబెత్… 1947లో గ్రీస్, డెన్మార్క్‌ మాజీ రాకుమారుడు ఫిలిప్‌ మౌంట్ బాటన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫిలిప్‌ను ఆమె మొదటిసారి 1934లో కలిశారు. 1939లో అతనిని కలిసినప్పుడు ఎలిజబెత్‌కు 13ఏళ్లు. ఫిలిప్‌ బ్రిటిషర్ కాకపోవడం, ఆయనకు రాకుమారిని పెళ్లాడే స్థాయి లేకపోవడం.. పైగా అతని చెల్లి నాజీలతో సంబంధాలు ఉన్న ఒక రష్యన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వంటి కారణాలు.. ఎలిజబెత్‌ ప్రేమకు అడ్డుపడ్డాయ్. ఐనా వాటిని ఆమె లెక్క చేయలేదు. ధైర్యంగా ఫిలిప్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రపంచాన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని తన స్టైల్‌ ఏంటో ప్రపంచానికి చూపించిన ఎలిజబెత్.. మ్యారేజ్‌ లైఫ్‌గా సాగిపోయింది. ఐతే తర్వాత రోజుల్లో వ్యక్తిగతంగా రకరకాల షాక్‌లు ఎదుర్కోవాల్సి వచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. బ్రిటీష్ ఆర్థిక పరిస్థితి పడిపోతూ వచ్చింది. ఇక 1956లో సూయజ్ కాలువ విషయంలో బ్రిటన్ మాట నెగ్గించుకోలేకపోయింది. దీంతో బ్రిటిష్ ప్రభావం క్షీణించడం మరింత వేగవంతమైంది. సూయజ్ కాలువను జాతీయం చేయాలన్న ఈజిప్ట్ ప్రయత్నాన్ని నిలువరించడానికి పంపిన బ్రిటన్ సైనిక బలగాలను అర్ధంతరంగా వెనక్కి తీసుకోవడం.. అప్పటి ప్రధాని ఆంథోనీ ఈడెన్ రాజీనామా చేయడంలాంటివి ఎలిజబెత్ 2కి రాజకీయంగా చిక్కులు తీసుకువచ్చాయ్. 1963లో రాణి మరోసారి రాజకీయ వివాదంలో కేంద్ర బిందువయ్యారు. అప్పటి ప్రధాని హెరాల్డ్ మెక్‌మిలన్ పదవి నుంచి తప్పుకోగా.. ఎలాంటి సంప్రదింపులు లేకుండా.. అప్పటి ఎర్ల్‌ ఆఫ్‌ హోంను ఆయన స్థానంలోకి తీసుకురావడం.. ఎలిజబెత్ మీద విమర్శలకు కారణం అయింది.

ఇక తన పాలనలో కుటుంబ సభ్యుల నుంచి అనేక విషయాల్లో ఎలిజబెత్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎలిజబెత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆమె చెల్లెలు మార్గరేట్‌ చేసిన పని విమర్శలకు కారణం అయింది. పెద్దలు కుదిర్చిన నిశ్చితార్థాన్ని బ్రేకప్‌ చేసుకొని.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది మార్గరేట్ ! ఐతే ప్రేమించిన వ్యక్తితోనూ ఆమె ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది. ఎలిజబెత్‌ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌, ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ డయానా పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రాజకుటుంబంలో ఇమడలేక, చార్లెస్‌తో వేగలేక డయానా విడాకులు తీసుకుంది. ఐతే కొద్దిరోజులకే ఆమె కారు ప్రమాదంలో చనిపోవడం… రకరకాల విమర్శలకు కారణం అయింది. ఇక డయానాతో విడిపోయిన తర్వాత ప్రిన్స్ చార్లెస్‌… కెమిల్లాను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన కిరీటం దక్కాలని బతికున్నప్పుడు చెప్పింది కెమిల్లా గురించే !

రాణి ఏకైక కూతురు ప్రిన్సెస్ అన్నె.. మార్క్ ఫిలిప్‌ను పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. ఇక మరో కుమారుడు అడ్వర్డ్, సారాను పెళ్లిచేసుకోగా.. వారి పెళ్లి కూడా పెటాకులు అయింది. ఇక చివరివాడు ప్రిన్స్ ఆండ్రూ! తన ప్లేబాయ్ లైఫ్‌స్టైల్‌తో రాయల్ ఫ్యామిలీకి తలపోటుగా మారాడు. మైనర్లను శారీరకంగా హింసించారన్న కేసు కూడా ఉంది అతని మీద ! ఇక ప్రిన్స్ ఎలిజబెత్‌ మనవడు ప్రిన్స్‌ హ్యారీ కూడా ఇలానే ప్రవర్తించి వార్తల్లో ఉండేవాడు. ఐతే ఆ తర్వాత మారిపోయి.. మిలటరీకి సేవలు అందించడం, జనాల్లో కలవడం మొదలుపెట్టాడు. అమెరికన్ నటి మేగన్ మార్కెల్‌ను హ్యారీ ప్రేమించగా.. రాయల్ ఫ్యామీలీ అంగీకరించి పెళ్లి చేసింది. ఐతే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. రాజవంశపు హక్కులు వద్దు అంటూ హ్యారీ ఆ కుటుంబానికి దూరం కావడం ఆ సమయంలో వివాదంగా మారింది. బ్రిటన్ రాణిగా అత్యున్నత గౌరవ మర్యాదలను పొందగలిగిన ఎలిజబెత్‌.. తన ఇంటిని మాత్రం చక్కదిద్దుకోలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు