చైనాలో కేవలం ఒక ఫోన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టగా 2.25 మిలియన్ యువాన్లకు కొనుగోలు చేశారు అక్కడి పౌరుడు. అంటే మన రూపాయలలో దాని విలువ షుమారు రూ. 2 కోట్ల 24 లక్షల 54 వేలు. అయితే ఓ ఫోన్ నంబరుకు రూ. 2 కోట్లకు పైగా డబ్బులు పెట్టడం అంటే మాములు విషయం కాదు కదా? అసలు ఆ ఫోన్ నెంబర్‌కు అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారంటే?
ఈ ఫోన్ నెంబర్‌లోని చివరి ఐదు నెంబర్లు ‘ఎనిమిది’ నెంబర్‌ను కలిగి ఉండడమే విశేషం. మాండరిన్ భాషలో ఎనిమిది నెంబర్‌ను పలికితే ‘శ్రేయస్సు’ అనే అర్థం వస్తుంది. ఆ కారణంగానే చైనీయులు ఎనిమిది నెంబర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఎనిమిది నెంబర్ అంటే చైనాలో చాలా పాపులర్. ఈ నేపథ్యంలోనే ఐదు ఎనిమిదులు ఉన్న నెంబర్‌కు అంత ఖర్చు పెట్టారు. ఇక మాండరిన్ భాషలో ‘నాలుగు’ నెంబర్ అంటే ‘చావు’ అని పలికినట్టు ఉంటుంది. దీంతో చైనీయులు నాలుగు నెంబర్‌ను చెడుగా భావిస్తారు.