Long Covid Damaged Organs
Long Covid Damaged Organs : కరోనా మహ్మమారి ప్రపంచాన్ని గడగడ లాడించిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది లాంగ్ కోవిడ్ తో బాధపడుతూనేవున్నారు. సుదీర్ఘ కాలం కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న వారిలో అవయవాలు ఎక్కువగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. కొత్త అధ్యయనానికి చెందిన రిపోర్టును విడుదల చేశారు.
ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. సుదీర్ఘ కాలం కోవిడ్ తో బాధపడుతున్న వారిలో ఊపరితిత్తులు, మెదడు, కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా నిర్ధారించారు. లాంగ్ కోవిడ్ కు తీవ్ర ఆరోగ్య సమస్యలకు లింకు ఉన్నట్లు గుర్తించారు. కొత్త కస్టడీకి చెందిన నివేదికను లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ లో ప్రచురించారు. సుమారు 259 మంది రోగులపై ఆ అధ్యయనం చేశారు.
Keep Your Lungs : కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు !
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు. కోవిడ్ రాని 52 మందితో ఆ తేడాలను పోల్చారు. అత్యధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో సుమారు 14 శాతం అధికంగా డ్యామేజ్ జరిగినట్లు తేల్చారు.
బ్రెయిన్ లోనూ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గుర్తించారు. ఇక కిడ్నీల్లో ఆ సమస్యలు రెండింతలు ఉన్నట్లు తేల్చారు.లాంగ్ కోవిడ్ తో బాధపడిన వారి గుండె, కాలేయానికి ఎటువంటి మార్పులు లేవని నిర్ధారించారు. సుదీర్ఘ కాలం కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో కచ్చితంగా ఏదో ఒక అవయవం దెబ్బతింటోందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బెట్టి రామన్ పేర్కొన్నారు.