Indonesia Eartquake : ఇండోనేషియాలో భూకంపం.. 6.1గా తీవ్రత నమోదు

ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇండోనేషియాలో మళ్లీ భూకంపం అలజడి సృష్టించింది. మలుకులోని అమహైకు 71కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది.

Indonesia Earthquake : ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇండోనేషియాలో మళ్లీ భూకంపం అలజడి సృష్టించింది. మలుకులోని అమహైకు 71కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. రికార్డు స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:43 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకేంద్రాన్ని గుర్తించినట్టు జియోఫిజికల్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.

యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం (EMSC) మరో నివేదిక విడుదల చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) అదే భూకంపం 5.9 తీవ్రతతో నివేదించింది. ప్రాధమిక భూకంప డేటా ఆధారంగా.. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంప కేంద్రం నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమహైలో తేలికపాటి భూప్రకంపనలు వచ్చినట్టు భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా సంభవించిన ఈ భూ ప్రకంపనలకు భూకంప కేంద్రానికి సమీపంలోని కొన్ని ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. ఇండోనేషియాలోని లుమాజాంగ్, మ‌లంగ్, బ్లిట‌ర్, జెంబ‌ర్, ట్రెంగ్లక్‌లో ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు