×
Ad

Earthquake : భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..

Earthquake : అలాస్కా - కెనడియన్ భూభాగమైన యుకాన్ మధ్య సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ...

Earthquake

Earthquake : అలాస్కా – కెనడియన్ భూభాగమైన యుకాన్ మధ్య సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. లోకల్ టైమ్ 11:41AM తర్వాత దాదాపు 30 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Goa Fire Accident : గోవాలో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23మంది మృతి.. మృతులంతా వారే..

అలాస్కాలోని జునేయుకు వాయువ్యంగా 230 మైళ్లు (370 కిలోమీటర్లు), యుకాన్‌లోని వైట్‌హార్స్‌కు పశ్చిమాన 155 మైళ్లు (250 కిలోమీటర్లు) దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

వైట్‌హార్స్‌లో, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సార్జెంట్ కాలిస్టా మాక్లియోడ్ మాట్లాడుతూ.. భూకంపం గురించి తమ సిబ్బందికి రెండు సార్లు కాల్స్ వచ్చాయని చెప్పారు.

యుకాన్‌లో భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం పర్వత ప్రాంతం అని, అక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారని నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప శాస్త్రవేత్త అలిసన్ బర్డ్ అన్నారు. అయితే, ఈ భూకంపం దాటికి ఎక్కువ మంది ప్రజలు అల్మారాలు, గోడల నుంచి వస్తువులు పడిపోతున్నాయని నివేదించారని బర్డ్ చెప్పారు. అయితే, పెద్ద నష్టం ఏమీ జరగలేదని తెలిసిందని చెప్పారు.