డ్రాగన్ చైనా ప్రధాన భూభాగంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. శనివారం (ఏప్రిల్ 4, 2020) నాటికి 30 వరకు కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవలే చైనాలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో కొత్త కరోనా కేసుల సంఖ్య 19కి పెరిగాయి. అంతేకాదు.. స్థానికంగా కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి వచ్చినవారితో కలిసిన చైనా దేశీయులకు ఆదివారం నాటికి 25 కొత్త కేసులు నమోదైనట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అంతకుముందు ఒక రోజులో 18 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం స్థానికంగా ఐదు కొత్త వైరస్ వ్యాప్తి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కొత్త వైరస్ కేసులన్నీ చైనాలోని సౌతరన్ కోస్టల్ ప్రావిన్స్ గ్యాంగ్ డాంగ్ లోనే ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ చైనా ప్రధాన భూభాగంలో మొత్తం 81, 669 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3 నుంచి 3,329కి చేరింది.
అయినప్పటికీ, ఫిబ్రవరిలో మహమ్మారి విజృంభణ నుంచి క్రమంగా రోజు ఇన్ఫెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. అప్పుడు రోజు వందలాది కొత్త కేసులు నమోదయ్యేవి. బీజింగ్ లో వైరస్ వ్యాప్తి కాకుండా నియంత్రణ చర్యలను విధించినప్పటికీ కొత్త కేసులు నమోదు కావడం ఆగలేదు. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకినప్పటికీ వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించని వారు చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దాదాపు విదేశీయులందరితో పాటు దేశ సరిహద్దులను కూడా చైనా మూసివేసింది.
చైనాలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులన్నీ లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం విదేశాల్లో నుంచి చైనీయుల నుంచే సంక్రమించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వ్యక్తులను గుర్తించి వారిని ఐసోలేట్ చేసేందుకు అక్కడి కేంద్ర ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది. శనివారం నాటికి చైనా ప్రధాన భూభాగంలో 47 వరకు వైరస్ లక్షణాలు కనిపించని బాధితులను గుర్తించినట్టు ఆరోగ్య కమిషన్ తెలిపింది. అంతకుముందు రోజుకు 64 కేసులు నమోదయ్యాయి.