హెచ్ఐవీ ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా బయపెడుతున్న వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మరణం తధ్యం అని ఇప్పటివరకూ అనుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయలేం, నివారణ ఒక్కటే మార్గం. మందులు వాడుతూ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అంతే.. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి హెచ్‌ఐవీ పూర్తిగా నయమైందట. క్యాన్సర్ బారిన పడిన ఒక వ్యక్తి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకోవడంతో అతనికి హెచ్ఐవీ వైరస్ నుంచి ఉపశమనం లభించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
హెచ్ఐవీ ప్రతిరోధకం ఉన్న దాత నుంచి సేకరించిన ఎముక మజ్జ (బోన్ మ్యారో)ను ఆ పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేశామని వైద్యులు తెలిపారు. దీంతో హెచ్ఐవీ వైరస్ అతని శరీరంలో నుంచి దూరమైనట్లు తెలిపారు. ‘ది లండన్ పేషెంట్’గా పిలుస్తోన్న అతడికి హెచ్ఐవీ సోకినట్లు 2003లో వెల్లడైంది. తర్వాత అతడికి హడ్జ్‌కిన్ లింఫోమా ఉన్నట్టు తేలడంతో ఆ క్యాన్సర్‌కు చికిత్సగా 2016లో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
Also Read : ఇదేం అలవాటురా బాబూ : కిలోన్నర వెంట్రుకలు మింగేసింది
హెచ్ఐవీ ప్రతిరోధం ఉన్న అరుదైన జెన్ మ్యూటేషన్ ఉన్న వ్యక్తి నుంచి స్టెమ్ సెల్‌ను సేకరించి, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా.. హెచ్ఐవీ పేషెంట్ రోగనిరోధక శక్తి పెరిగిపోయింది. హెచ్ఐవీకి విరుగుడుగా అతడి రోగనిరోధక వ్యవస్థ పని చేయడంతో హెచ్ఐవీ బారిన పడిన అతనిని వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకోవడానికి రోజూ మందులు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
కానీ హెచ్ఐవీ లేదని నిర్ధారణ అయ్యాక అతడు మందులు తీసుకోవడం ఆపేశాడు. కానీ 18 నెలలు గడిచినా అతడిలో హెచ్ఐవీ వైరస్ జాడ ఎక్కడా కనిపించలేదు. సదరు పేషెంట్ శరీరంలో హెచ్ఐవీ జాడ లేదని అతడికి చికిత్స అందించిన ప్రొఫెసర్, హెచ్ఐవీ బయాలజిస్ట్ రవీంద్ర గుప్తా తెలిపారు. కానీ వ్యాధి పూర్తిగా నయమైందని అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
హెచ్ఐవీ వైరస్ జాడ మాయమైన రెండో పేషెంట్ ఇతడు కావడం విశేషం. గతంలో బెర్లిన్ పేషెంట్ రే బ్రౌన్ అనే అమెరికా వ్యక్తి విషయంలో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. 2007లో అతడు జర్మనీలో ఇదే తరహా ట్రీట్మెంట్ తీసుకోవడంతో హెచ్ఐవీ కూడా తగ్గిపోయింది. అతడిలో ఇప్పటికీ హెచ్ఐవీ లక్షణాలు కనిపిచలేదు.
Also Read : అర్హులకు మాత్రమే :రేషన్ కార్డుల జారీలో కీలక నిర్ణయం