Major Train Accident In Pakistan 50 People Dead
Pakistan train accident: దాయాది దేశం పాకిస్తాన్ లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీ కొన్నాయి. రేతి – దాహర్కి రైల్వే స్టేషన్ల మధ్య గోట్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50మంది వరకూ చనిపోయినట్లు గుర్తించారు. వందల సంఖ్యలో గాయపడ్డారని అక్కడి స్థానిక మీడియా చెప్పింది.
రైల్వే అధికారుల కథనం ప్రకారం.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మీద ఉండగానే దూసుకొచ్చిన సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ వేగంతో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 50మంది చనిపోగా మిగిలిన క్షతగాత్రులు భోగీల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వారిని బయటకు తీసేందుకు భారీ మెషినరీ అవసరం ఉందని డీసీ ఒస్మాన్ అబ్దుల్లా అన్నారు. ఆ మార్గంలో ప్రమాదం జరగకూడదని ముందస్తు జాగ్రత్తగా రైల్వే ట్రాఫిక్ ను మళ్లించారు. పాకిస్తాన్ సైనికులు స్పాట్ కు చేరుకుని ఆపరేషన్ లో పాల్గొన్నారు. క్షతగాత్రులను, మృతదేహాలను దగ్గర్లోని హాస్పిటల్స్ కు పంపించారు.