Malala Yousafzai
Malala Yousafzai : మహిళా హక్కుల పోరాట యోధురాలు మలాలా యూసఫ్ జాయ్ ‘బార్బీ’ సినిమా చూసిన తరువాత చేసిన ట్వీట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ మనసు దోచుకుంది.
Oppenheimer vs Barbie : ‘ఓపెన్‌హైమర్’ కాదు ‘బార్బీ’కే నా ఓటు అంటున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్..
మలాలా యూసఫ్ జాయ్ వీకెండ్‌లో భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి ‘బార్బీ’ సినిమా చూసారట. ఈ సినిమా తనకు తన భర్తకు ఎంతగానో నచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘ఈ బార్బీకి నోబెల్ బహుమతి ఉంది’ అని మలాలా తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. ఆమె ట్వీట్‌కు భర్త మాలిక్ ‘ నేను కెనఫ్’ అని ఫన్నీ ఇమోజీతో సమాధానం ఇచ్చారు. మిస్టర్ మాలిక్ కెన్ వలే, మలాలా పింక్ సల్వార్ కుర్తాలో కనిపించారు. బార్బీ బాక్స్ లో ఫోటోకి ఫోజులిచ్చారు.
మలాలా ‘బార్బీ’ సినిమా తమకి చాలా నచ్చిందని చాలా కామెడీగా ఉందని అలాగే ఆలోచనాత్మకంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆమె పోస్టుపై చాలామంది నెటిజన్లు స్పందించారు. ‘ఈ బార్బీ అన్ని బార్బీలకు స్ఫూర్తినిస్తుందని’.. ‘ఇప్పటివరకు చదివిన అత్యుత్తమ బార్బీ క్యాప్షన్’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. గ్రెటా గెర్విగ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘బార్బీ’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.
Real Life Barbie : రియల్ లైఫ్ బార్బీలా కనిపించడానికి రూ. లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది
మలాలా యూసఫ్ జాయ్ 2012 లో స్వాత్ వ్యాలీలో తాలిబాన్ దాడి నుంచి బయటపడ్డారు. UK బర్మింగ్‌హామ్‌లోని ప్రత్యేక ఆసుపత్రిలో తిరిగి కోలుకున్నారు. మలాలా బాలికల విద్య కోసం ఓ ఉద్యమమే చేశారు. డిసెంబర్ 2014 లో 17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కురాలు మలాలా యూసప్ జాయ్.
This Barbie has a Nobel Prize ? He’s just Ken pic.twitter.com/Ljbqdfpgfd
— Malala Yousafzai (@Malala) July 30, 2023