Dog CPR : శునకానికి సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు.. వీడియో వైరల్..!

Dog CPR : కొనఊపిరితో పోరాడుతున్న ఓ శునకానికి ప్రాణం పోశాడో వ్యక్తి. రోడ్డుమీద వెళ్తున్న ఆ శునకం ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది.

Man Brings Dog Back To Life By Performing Cpr, Heartwarming Viral Video

Dog CPR : కొనఊపిరితో పోరాడుతున్న ఓ శునకానికి ప్రాణం పోశాడో వ్యక్తి. రోడ్డుమీద వెళ్తున్న ఆ శునకం ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. అది గమనించిన అటుగా వెళ్లే వ్యక్తి వెంటనే ఆ శునకానికి సీపీఆర్ అందించాడు. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆ శునకం కాసేపటికి లేచి నిలబడింది. అది చూసిన వాళ్లంతా మిరాకల్ అంటూ అభినందించారు.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. దాంతో వీడియో మరింత మందికి యూజర్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోను చూసిన నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వీడియోలో ఒక వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న కుక్కను చూశాడు. వెంటనే దాని దగ్గరగా వెళ్లి తట్టి చూశాడు. అప్పటికి కుక్కలో చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన అతడు వెంటనే సీపీఆర్ అందించే ప్రయత్నం చేశాడు.

శునకానికి తిరిగి జీవం పోసేందుకు వెనువెంటనే సీపీఆర్ అందించడం చేశాడు. అంతే.. కాసేపటికి ఆ శునకం లేచి పరుగులు పెట్టింది. వైరల్ వీడియో ఎక్కడిదో గుర్తు తెలియడం లేదు. కొన్నిసార్లు అద్భుతాలు ఇలంటి మంచివారి చేతుల మీదుగానే జరుగుతుంటాయని పోస్ట్ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత.. దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తారు.

Read Also : Viral video: ఎన్నాళ్లకు కలిశామో.. కోతుల మధ్య ఆప్యాయతలు చూడండి.. ఫిదా అవుతారు