రెండు చేతులూ వెనక్కు కట్టేసి కేవలం జీన్స్ ప్యాంట్ మాత్రమే ఉన్న శవం పోలీసులకు కనిపించింది. ప్రాథమిక విచారణలో మహిళ శరీరానికి తల లేని సంగతిని గుర్తించారు. రక్తంతో నిండి ఉన్న శవానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
బలమైన కారణం కాదు, వ్యక్తిగత ద్వేషం కాదు కేవలం ఇంగ్లీషులో మాట్లాడిందనే కారణంతో చంపేశాడు. తలను పగులగొట్టి మెదడుని మింగేశాడు. ఫిలిప్పీన్స్‌లోని మియాందానోలో ఈ ఘటన జరిగింది. దారిలో వెళ్తుండగా గుర్తు తెలియని మహిళ ల్లెడ్ బాగ్‌టాంగ్‌తో ఏదో మాట్లాడింది. అది అతనికి అర్థం కాలేదు.
అంతే.. చంపేశాడు. రెండు చేతులూ వెనక్కు కట్టేసి కేవలం జీన్స్ ప్యాంట్ మాత్రమే ఉన్న శవం పోలీసులకు కనిపించింది. ప్రాథమిక విచారణలో మహిళ శరీరానికి తల లేని సంగతిని గుర్తించారు. రక్తంతో నిండి ఉన్న శవానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎంక్వైరీలో పోలీస్ కుక్కలు నిందితుడి ఇంటి ముందుకు వెళ్లి ఆగాయి. ఆ సమయంలో ఇల్లు తాళం వేసి ఉంది. స్థానికులు ఆ ఇంట్లో ఉండే వ్యక్తి కంగారుగా ఇల్లు వదిలివెళ్లిపోయిన సంగతి చెప్పారు. ఆ మహిళ బాగ్ టాంగ్‌తో నడిచి వెళ్లడం చూశామని తెలిపారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
కొద్ది రోజుల తర్వాత హంతకుడ్ని పట్టుకున్నారు. మహిళను చంపడానికి కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషు మాట్లాడితే తనకు నచ్చదని, ఆ మహిళ ఎవరో తనకు తెలీదని, వచ్చి ఇంగ్లీషులో మాట్లాడుతుంటే చికాకు అనిపించి చంపేశానని చెప్పాడు. అన్నం ఉడుకుతుంటే దానిపై మెదడు పెట్టుకుని తినేశానని చెప్పాడు.
పుర్రెను అతని ఇంట్లో నుంచే బయటకు పడేశానని బయటపెట్టాడు. అతణ్ని చాలా రోజులుగా గమనిస్తున్న స్థానికులు మానసిక స్థాయి సరిగా లేదని వివరించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చనిపోయిన మహిళ గురించి వివరాలు తెలుసుకోలేకపోయారు.