×
Ad

USA Multnomah Falls : జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి.. భార్య, పిల్లలు చూస్తుండగానే

కొండపై వాకింగ్ చేస్తుండగా అతను జారిపడ్డాడు. భార్య, పిల్లల చూస్తుండగానే అతను సుమారు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు.

  • Published On : July 4, 2023 / 07:00 PM IST

Multnomah Falls man died

Man Died : అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి చెందారు. భార్య, పిల్లలు చూస్తుండగానే సంఘటన జరిగింది. ఈ ఘటన కొలంబియా నదిపై ఉన్న ముల్తనోమా జలపాతం వద్ద చోటు చేసుకుంది.

జులై 2న 40 ఏళ్ల గెర్రాడో పెర్నాండేజ్ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి ముల్తనోమా జలపాతం చూసేందుకు వెళ్లారు. అయితే కొండపై వాకింగ్ చేస్తుండగా అతను జారిపడ్డాడు. భార్య, పిల్లల చూస్తుండగానే అతను సుమారు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు. దీంతో అతను మృతి చెందాడు.

Hyderabad Metro Train : హైదరాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో 5 లక్షల 10వేల మంది ప్రయాణం

వాటర్ ఫాల్ వద్ద ఉన్న బెన్సన్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకున్నది. బహుశా అతను మద్యం సేవించి ఉండడం వల్ల జారిపడి ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 45 నిమిషాలు వెతికిన తర్వాత అతని శరీరాన్ని గుర్తించారు.