Man Heroically Catches 2 Year Girl After She Falls From Fifth Floor Window
Man Catches 2 year girl : ఐదవ అంతస్థు కిటికీ నుంచి జారి పడిపోయిన రెండేళ్ల పాపను ఇద్దరు వ్యక్తులు బంతిలా క్యాచ్ పట్టుకున్నారు. దీంతో పాప ప్రాణాలతో బయటపడింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో రెండే పాప ఎలా చేరుకుందో కిటికీలోంచి జారిపోయింది. అంతలోనే ఓ వ్యక్తి కింత పార్క్ చేస్తుండగా కేకలు వినిపించి పైకా చూశాడు. ఏ క్షణంలో అయినా సరే జారిపోవటం సిద్ధంగా ఉన్న ఓ పాప ఐదో అంతుస్థు నుంచి కనిపించింది. దీంతో వెంటనే తను అప్రమత్తమయ్యాడు. తన భార్యకూడా సహాయంగా వచ్చి జారిపోయి పడిపోతున్న పాపను బంతిని పట్టినట్లుగా క్యాచ్ పట్టుకున్నారు.
షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించాయి. పక్కగా చూస్తే ఐదో అంతస్తు కిటికీ నుంచి ఓ చిన్న పాప కిందకు జారి పడిపోతోంది. దీంతో షెన్ డాంగ్, అతడి భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి క్షణాలలో మళ్లీ కిందకు జారింది. పెద్దగా కేకలు వేయడం, వాటిని విన్న షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. దీంతో షెన్ డాంగ్ నిజమైన హీరో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022