Man hits 2 deer with new car: అదృష్టం ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతేకాదు..దరిద్రం ఎప్పుడు తలుపు తడుతుందో కూడా తెలియదు. ఎన్నో సమస్యలతో బాధ పడుతున్న వారు రాత్రికి రాత్రే లక్షాదికారి, కోటీశ్వరుడు అయిపోతే..ఎలా ఉంటుంది. సంతోషంలో మునిగి తేలుతాడు కదా. అలాంటేదే ఒకటి జరిగింది. మనోవేదనతో ఉన్న అతనికి ఓ లాటరీలో ఏకంగా రూ. 20 లక్షల డాలర్లు (రూ. 14.60) సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది.
నార్త్ కరోలినాకు చెందిన ఆంటోనీ డోవ్ ఎప్పటిలాగే ఆఫీసులో కు వెళుతున్నాడు. తాను కొన్న కొత్తకారులో బయలుదేరాడు. అయితే..అనుకోకుండా..రోడ్డు మీదకు రెండు జింకలు దూసుకొచ్చాయి. కారు కంట్రోల్ చేయలేక..ఆ జింకలను ఢీకొన్నాడు. ఇక ఆ రోజంతా..ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మనసంతా బాలేకపోవడంతో చాలా డిస్ట్రర్బ్ అయ్యాడు. ప్రమాదం తర్వాత..ఇంటికి వెళ్లాడు..నిద్ర లేచిన తర్వాత..గతంలో కొనుగోలు చేసిన లాటరీ గురించి గుర్తుకు వచ్చింది. దీంతో తన వద్దనున్న టిక్కెట్లను తనిఖీ చేశాడు. కొన్న నాలుగు టికెట్లలో మూడింటికి ఎలాంటి ఫ్రైజ్ రాలేదు. నాలుగో టికెట్ ను చెక్ చేస్తున్నాడు.
ఒక్కసారిగా…మనస్సులో ఉన్న బాధ వెళ్లిపోయింది. అతని ముఖంలో సంతోషం తాండవించింది. లాటరీలో అతడికి రూ. 20 లక్షల డాలర్లు వచ్చినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఈ వివరాలను నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ మంగళవారం వెల్లడించింది. ముందు అతడు పది లక్షల డాలర్లు విలువైన లాటరీని గెల్చుకున్నాడు. కానీ మెగాప్లయర్ టికెట్ డ్రా చేసినప్పుడు ఆ మొత్తం రెట్టింపు అయింది. ఈ సోమవారం రాలేలోని లాటరీ ప్రధాన కార్యాలయంలో తన గిఫ్ట్‌ను క్లెయిమ్ చేసుకున్నాడు. ట్యాక్స్ ప్రొసీడింగ్స్ తరువాత అతడికి మొత్తం 14 లక్షల డాలర్లు వచ్చాయి. ఆ డబ్బుతో తన తల్లిదండ్రులకు ఇళ్లు కొనివ్వడంతో పాటు, ఆరోజు ప్రమాదంలో దెబ్బతిన్న తన కారును రిపేర్ చేయించుకుంటానని డోవ్ తెలిపాడు.