ప్రియురాలిని ముక్కలుగా నరికిన ప్రియుడు.. శవాన్ని బ్యాగుల్లో పెట్టుకుని 400 మైళ్ల ప్రయాణం, ఎందుకిలా చేశాడో తెలిసి పోలీసులు షాక్

  • Publish Date - September 18, 2020 / 02:46 PM IST

అమెరికాలోని ఇల్లినాయిస్ లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చేసిన పని అతడి కుటుంబసభ్యులను, స్థానికులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ వ్యక్తి పాల్పడిన ఘాతుకం వారికి చెమట్లు పట్టించింది. అతడు మనిషా లేక సైకోనా అనే అనుమానం కలిగించింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే, తన ప్రియురాలిని చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శవ భాగాలను 3 బ్యాగుల్లో సర్దాడు. ఆ బ్యాగులతో ఏకంగా 400 మైళ్లు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బ్యాగుల నుంచి దుర్వాసన రావడంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది.

ప్రియురాలిని చంపి ముక్కలుగా నరికి బ్యాగుల్లో సర్దాడు:
అతడి పేరు మెల్విన్ మార్టిన్. వయసు 30ఏళ్లు. లూయిస్ విల్లేలో నివాసం ఉంటాడు. మార్టిన్ కిరాతకానికి ఒడిగట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎల్లింగ్ టన్ ని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు బ్యాగుల్లో సర్దుకున్నాడు. అక్కడి నుంచి గ్రేహౌండ్ బస్‌లో ఇలినాయిస్‌లోని మార్ఖంలో ఉంటున్న తల్లిదండ్రులు దగ్గరికి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న మూడు బ్యాగులను మార్టిన్ ఇంట్లో భద్రపరిచాడు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.

దుర్వాసన రావడంతో బయటపడిన దారుణం:
కాగా, కొన్ని రోజుల తర్వాత బ్యాగుల నుంచి భయంకరమైన దుర్వాసన బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన మార్టిన్ బ్యాగులను గ్యారేజ్‌కి మార్చాడు. కాగా, కొడుకుని గమనిస్తూ ఉన్న తల్లి ఏదో తేడా ఉన్నట్లు గ్రహించింది. పైగా ఆ బ్యాగుల నుంచి దుర్వాసన వస్తుండడంతో కొడుకుని లైబ్రరీకి పంపించిన ఆమె, అతడు వెళ్లాక బ్యాగులను తెరిచి చూసి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. బ్యాగ్‌లో మానవ శరీర భాగాలు కనిపించడంతో ఉలిక్కిపడింది.

బ్యాగులో యువతి శరీర భాగాలు:
వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు మూడు బ్యాగులు ఓపెన్ చేసి చూశారు. అది మహిళ మృతదేహంగా గుర్తించారు. కంగుతిన్న పోలీసులు మార్టిన్ ను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుని విస్తుపోయారు.

తన ప్రియురాలిని నెల రోజుల క్రితం అతి దారుణంగా చంపేసి, శరీర భాగాలను బ్యాగుల్లో సర్దుకుని తీసుకుని వచ్చినట్లు మార్టిన్ చెప్పాడు. ఎందుకు ఇలా చేశావని పోలీసులు అడగ్గా, మార్టిన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చాడు. తన ప్రియురాలు ఎప్పుడూ తనతో కలిసి ఉండాలనే తాను ఇలా చేశానని చెప్పాడు. ఆమెని చంపి ముక్కులుగా నరికి తన వెంట తెచ్చుకున్నానని వివరించాడు.

ఎప్పటికీ తనతోనే కలిసి ఉండాలని:
మార్టిన్ తల్లి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లైబ్రరీకి వెళ్లి అక్కడే మార్టిన్ ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత తనకేమీ తెలీదని మార్టిన్ బుకాయించాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. మార్టిన్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులను ఓపెన్ చేయకుండా భద్రంగా ఉంచుకోవడం అతడి కుటుంబసభ్యుల్లో అనుమానాలు రేకెత్తించింది. నెల రోజుల క్రితం మార్టిన్ అతడి ప్రియురాలి మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలోనే మార్టిన్ ఆమెని చంపేశాడని పోలీసులు తెలిపారు. ఎల్లింగ్ టన్ లూయిస్ విల్లేలోని ఎయిర్ పోర్టులో టీమ్ మెంబర్ గా క్యాషియర్ గా పని చేసింది.

ఎల్లింగ్ టన్ మరణాన్ని ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, గతంలో ఆమె కలిసి పని చేసిన సహచర ఉద్యోగులు తట్టుకోలేకపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. ఎల్లింగ్ టన్ లూయిస్ విల్లేలోని యూనివర్సిటీలో చదువుకుంది. ఆమె చాలా మంచిదని స్నేహితులు చెప్పారు. ఎల్లింగ్ టన్ చాలా సరదాగా ఉండేదని కొలీగ్స్ గుర్తు చేసుకున్నారు. ఎల్లింగ్ టన్ ఇక లేదు అని తెలిసి బోరున విలపించారు.


ట్రెండింగ్ వార్తలు