Man proposed to gf: కోమా నుంచి కోలుకునేంతవరకూ నిరీక్షించి పెళ్లి ప్రపోజల్
విక్టోరియా అతనికి సంవత్సరం మూడు నెలల పాటు ఒకరికొకరు తెలుసు. ఆమె వ్యక్తిత్వం నచ్చి ఏదో ఒకరోజు కచ్చితంగా కోమాలో నుంచి బయటికొస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ..

Man Proposed To Girl After Coma
Man proposed to gf: ప్రేమంటే ఇదేనని చెప్పలేం. అది అనంతం. మన స్వార్థం కోసం వేరొకరితో బంధాన్ని కోరుకోవడమంటే ప్రేమ కాదని స్పష్టంగా చెప్పగలం. క్షేమం కోరుకుంటూ.. త్యాగం చేయగలగడం కదా నిజమైన ప్రేమ. వయస్సునో.. హోదానో.. శరీర వన్నెనో చూసి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిన గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు కోలుకుంటుందా అని నిరీక్షించి ప్రేమను వ్యక్తపరిచాడు ఆ లవర్.
ఆమెకు స్పృహ రాగానే మనసులో ఉన్న ఫీలింగ్ ను రింగులా చూపించి.. నాతో పెళ్లి నీకు ఇష్టమేనా అంటూ ప్రపోజ్ చేశాడు. కోమా నుంచి బయటపడుతూనే బరువెక్కిన కనురెప్పలను తెరుస్తుంటే.. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె బెడ్ దగ్గరగా వెళ్లి చేతిలో రింగ్ తీసి ప్రపోజ్ చేశాడు. కూతురు కోమా నుంచి కోలుకోవడంతో పాటు అంతగా ప్రేమించే భాగస్వామి దొరికినందుకు సంతోషంలో మునిగిపోయారు. స్వయంగా ఆ యువతి తల్లే అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఫిలిప్పైన్స్ కు చెందిన విక్టోరియా.. ప్రస్తుతం చికాగోలో ఉంటుంది. ఆమె 2016నుంచే Lupus అనే సిండ్రోమ్ తో బాధపడుతుంది. అంతకంటే ముందే స్టీవెన్స్ – జాన్సన్ సిండ్రోమ్ అనే ప్రమాదకరమైన చర్మవ్యాధితో పోరాడుతూ ఉంది. ఇవి రెండు కలిసి అటాక్ చేయడం చాలా అరుదు. ఈ రెండింటి కారణంగానే ఆమె మూడళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కోమాలోకి వెళ్లిపోయింది.
విక్టోరియా అతనికి సంవత్సరం మూడు నెలల పాటు ఒకరికొకరు తెలుసు. ఆమె వ్యక్తిత్వం నచ్చి ఏదో ఒకరోజు కచ్చితంగా కోమాలో నుంచి బయటికొస్తుందనే ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. కోలుకుంటుందని తెలిసిన క్షణాల్లో వ్యవధిలోనే పెళ్లిప్రపోజ్ పెట్టేశాడు. తను పూర్తిగా కోలుకున్న తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవనున్నారు.
నికోలస్: హాస్పిటల్‌లో అంతా సవ్యంగానే ఉంటుందని ధైర్యం చెప్పేవాడ్ని. ప్రతి రోజూ ఆమె ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చేవాడిని. గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే కచ్చితంగా షేర్ చేసుకునే వాడిని.
విక్టోరియా: ఒకవేళ నాకు ఇంకేమైనా అయితే ఈ క్షణాలైనా గుర్తుంటాయనుకున్నారో.. ఏమో వీడియో తీస్తున్నామని చెప్పి లవ్ ప్రపోజ్ చేయించారు. నేను దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అతను నాలో బెస్ట్ చూశాడు. ఇంతకన్నా ఒక పార్టనర్ దగ్గర్నుంచి ఏం ఆశిస్తాం.
కోమా నుంచి కోలుకున్న ఏడు నెలల తర్వాత విక్టోరియాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కాకపోతే ఆమెకు వచ్చిన Lupus అనేది పూర్తిగా తగ్గేది కాదు. కంట్రోల్ లో ఉంటుందంతే. ఇప్పుడు ఈ కపుల్ ఒకటే గోల్ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది కల్లా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ను అంతా పిలిచి పెళ్లి చేసుకుని ఆ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.