Car Parking
New York : పార్కింగ్ లో ఉన్న కార్లను తీయడంలో కొంతమంది చాలా కష్టపడుతుంటారు. అదే..రెండు కార్ల మధ్యనున్న కారును పార్కు తీయాలంటే ఎలా ? సాధ్యమేనా..నో వే..అంటారు కదా. కానీ ఓ వ్యక్తి మాత్రం సింపుల్ గా రెండు కార్లకు ఇబ్బందులు కలుగకుండా తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ లో ఓ ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో కార్లను పార్కింగ్ చేశారు. అయితే..కార్లను పార్కింగ్ చేసే సమయంలో కొంత దూరం పాటిస్తే..ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Read More : New RBI Rules: ఆగస్టు 1 నుంచి కొత్త ఆర్బీఐ రూల్స్.. ఇకపై NACH సర్వీసులు 24×7 పొందొచ్చు!
కానీ..మూడు కార్లు కొద్ది దూరంలోనే ఒకదానివెనుక ఒకటి పార్క్ చేశాయి. మధ్యలో ఉన్న కారును తీయాలని ఓ వ్యక్తి వచ్చాడు. కానీ…ఏ మాత్రం తీయలేని పరిస్థితి ఉంది. అయినా..కారును తీయాలని ప్రయత్నించాడు. కారును వెనక్కి..ముందుకు తీస్తూ..సక్సెస్ ఫుల్ గా కారును బయటకు తీశాడు. ముందు..వెనుక ఉన్న కార్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తన కారును తీశారు. people ఇన్ స్ట్రా గ్రామ్ లో వీడియోను పోస్టు చేశారు. అతని డ్రైవింగ్ నైపుణ్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.